Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పరుపును మార్చినట్లు పురుషుల్ని మార్చేస్తారా?: రాజాసింగ్‌పై ఆ ఇద్దరు ఫైర్

సినీ పరిశ్రమలోని మహిళలందరూ మంచంపై పరుపును మార్చినట్టు పురుషులను మార్చేస్తారని రాజస్థాన్‌కు చెందిన ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలను తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సమర్థించారు. సినీ పర

Advertiesment
పరుపును మార్చినట్లు పురుషుల్ని మార్చేస్తారా?: రాజాసింగ్‌పై ఆ ఇద్దరు ఫైర్
, శుక్రవారం, 24 నవంబరు 2017 (11:41 IST)
సినీ పరిశ్రమలోని మహిళలందరూ మంచంపై పరుపును మార్చినట్టు పురుషులను మార్చేస్తారని రాజస్థాన్‌కు చెందిన ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలను తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సమర్థించారు. సినీ పరిశ్రమలో ఇలాంటి ఘటనలు ఎన్నో ఉన్నాయన్నారు. కొంత మంది మహిళలు అలాంటి పనులు చేస్తున్నారన్నారు. అంతేగాకుండా సినీ పరిశ్రమలోని మహిళలంతా చెడిపోయారని రాజాసింగ్ నోరా జారారు.
 
దీనిపై ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వ్యక్తులు ప్రజాప్రతినిధులు కావడం దురదృష్టకరమని తమ్మారెడ్డి తెలిపారు. సినీ పరిశ్రమలోని మహిళలంతా అలాంటివారే అయితే బీజేపీలో ఉన్న నటీమణులు కూడా అలాంటివారే అంటారా? అని తమ్మారెడ్డి ప్రశ్నించారు. ఇలాంటి కుసంస్కారులతో మాట్లాడడం తనవల్ల కాదని, ఇలాంటి వారితో మాట్లాడే స్థాయికి తాను దిగజారలేనని ఆయన స్పష్టం చేశారు. ఈ చర్చలో తాను పాల్గొనలేనని చెప్పి చర్చా కార్యక్రమం మధ్య లేచి వెళ్లిపోయారు.
 
అనంతరం రాజా సింగ్ మాట్లాడుతూ, యూట్యూబ్‌లో సినీ నటీమణులకు సంబంధించిన ఎన్నో వీడియోలు కనబడతాయని అన్నారు. సంజయ్ లీలా భన్సాలీ ఫ్యామిలీ గురించి తెలుసుకోవాలన్నారు. అదే కార్యక్రమంలో పాల్గొన్న సినీ విశ్లేషకుడు మహేష్ కత్తి.. 'సరే ఇక్కడెవరికీ సంజయ్ లీలా భన్సాలీ కుటుంబం గురించి తెలియదు.. మీరు చెప్పండి.. అందరూ తెలుసుకోవాలనుకుంటున్నారని చెప్పారు. 
 
ఇందుకు రాజాసింగ్ మౌనం వహించారు. ఇక్కడ సీనులో లేని మనుషుల గురించి నోటికి వచ్చినట్టు మాట్లాడడం అలవాటైపోయిందని కత్తిమహేష్ మండిపడ్డాడు. చరిత్రలో ఉందని చెబుతున్న ఓ మహిళ గురించి మాట్లాడుతూ... ఇప్పుడున్న మహిళలందర్నీ అవమానిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశాడు. కాగా రాజా సింగ్ వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగడంతో ఆయన క్షమాపణలు చెప్పుకొచ్చారు. 
 
సినీ పరిశ్రమలోని మహిళలపై తాను చేసిన వ్యాఖ్యలు ఎవరినైనా బాధపెట్టి ఉంటే వారికి క్షమాపణలు చెబుతున్నానని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తెలిపారు. ఒక టీవీ ఛానెల్‌లో జరిగిన చర్చ సందర్భంగా బీజేపీ రాజస్థాన్ ఎంపీ వ్యాఖ్యలను సమర్ధిస్తూ, రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపై ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, కత్తి మహేష్ వంటి వారు ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఆయన ఆలోచనలో పడ్డారు. 
 
తాను తప్పుడు ఉద్దేశ్యంతో ఆ వ్యాఖ్యలు చేయలేదని, తానెవరినీ కించపరచాలని భావించడం లేదని చెప్పారు. అయితే తాను చేసిన వ్యాఖ్యలు ఎవరినైనా బాధపెట్టి ఉంటే క్షమించాలని ఆయన కోరారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నోకియా 2: జియోతో కలిసి బండిల్ ఆఫర్.. ఉచిత డేటా