Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

లోకేశ్‌ నంది అవార్డులు నీ అబ్బసొమ్మా.. ఆంధ్ర వాళ్లు రోహింగ్యాలా? : పోసాని

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌పై సినీనటుడు పోసాని కృష్ణమురళి ప్రశంసల వర్షం కురిపించారు. నంది అవార్డుల ప్రకటనపై తీవ్ర ఆరోపణలు చేసిన పోసాని.. ఏపీ మంత్రి లోకేశ్‌పై మండిపడ్డారు. లోకేశ్‌లాంటి మనస్తత్

లోకేశ్‌ నంది అవార్డులు నీ అబ్బసొమ్మా.. ఆంధ్ర వాళ్లు రోహింగ్యాలా? : పోసాని
, మంగళవారం, 21 నవంబరు 2017 (17:10 IST)
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌పై సినీనటుడు పోసాని కృష్ణమురళి ప్రశంసల వర్షం కురిపించారు. నంది అవార్డుల ప్రకటనపై తీవ్ర ఆరోపణలు చేసిన పోసాని.. ఏపీ మంత్రి లోకేశ్‌పై మండిపడ్డారు. లోకేశ్‌లాంటి మనస్తత్వం తెలంగాణ ప్రజలకు ఉంటే ఇక్కడ ఆంధ్రావాళ్లు చెట్టుకొకరు పుట్టకొకరు పారిపోయేవాళ్లన్నారు. సీఎం కేసీఆర్ ఆంధ్రా ప్రజలను తమ బిడ్డలన్నారని గుర్తుచేశారు. 
 
ఉద్యమ సమయంలో దోచుకునే వాళ్లతోనే తమ కొట్లాటగానీ.. ఇక్కడ బతికేవాళ్లతో కాదని కేసీఆర్ చెప్పేవారన్నారు. ఏనాడు కూడా ఆంధ్రావాళ్లను తరమండి.. కొట్టండి అని కేసీఆర్ అనలేదని గుర్తుచేశారు. ఒక వేళ ఆంధ్రావాళ్లను వెళ్లగొట్టండి అని పిలుపునిచ్చివుంటే పిచ్చి కుక్కల్లా కొట్టి ఖమ్మం సరిహద్దులకు దాటించేవారన్నారు. లోకేశ్ వ్యాఖ్యలతో ఇవాళ తాము తెలుగు రోహింగ్యాలమయ్యామని వాపోయారు. ఈ సందర్భంగా కేసీఆర్‌కు పాదాభివందనం చేస్తున్నట్టు చెప్పారు. 
 
ఏపీలో ఆధార్, ఓటర్ కార్డులు లేనివారు నంది అవార్డులను విమర్శిస్తున్నారని లోకేశ్‌ చేసిన వ్యాఖ్యలపై ఆయన తీవ్రంగా స్పందించారు. ‘ట్యాక్స్ ఇక్కడ కడితే అక్కడ పనికిరారా.. విమర్శించకూడదా…? లోకేశ్‌… చదువుకున్నావా.. బుద్ది, జ్ఞానం, సంస్కారంతో మాట్లాడుతున్నావా… మీరు ఇక్కడ ట్యాక్స్ కట్టడం లేదా.. ప్రభుత్వం వచ్చాక కూడా ఇక్కడ ఇళ్లు కట్టుకున్నారు కదా.. మరి మీరు అక్కడ రాజకీయం ఎలా చేస్తారు’ అంటూ ప్రశ్నించారు. 
 
నీ లాంటి నాయకులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉండి ఉంటే మేం నాశనం అయ్యే వాళ్లం. కేసీఆర్‌ను చూసి ఎలా మాట్లాడాలో నేర్చుకోండి. లోకేశ్‌ నంది అవార్డులు నీ అబ్బ సొమ్మా.. గత ప్రభుత్వాలను చంద్రబాబు విమర్శించలేదా?. అప్పుడు చంద్రబాబును ఎవరైనా నాన్‌ లోకల్‌ అన్నారా? నంది అవార్డులు విమర్శిస్తే నాన్‌ లోకల్‌ అంటారా. 2014 వరకూ హైదరాబాద్‌ ఉమ్మడి రాజధాని. అప్పటివరకు, ఆ తర్వాత కూడా ఎవరైనా ఇక్కడ ఉండొచ్చు. ఆస్తులు పెంచుకుంటూ ఏపీలో కూర్చొని ఏదైనా మాట్లాడొచ్చా.
 
విమర్శించే వాళ్లు నాన్ లోకల్ అయితే జ్యూరీలో ఉన్న సభ్యుల మాట ఏంటి.. వారికి కూడా హైదరాబాద్‌లోనే ఆధార్ కార్డులు ఉన్నాయి కదా, వారు కూడా ఇక్కడే ట్యాక్స్‌లు కడుతున్నారు కదా మరి వారిని జ్యూరీలోకి ఎలా తీసుకున్నారు?. రాద్ధంతం చేస్తే నందులు తీసేస్తాం అన్నారు. మరి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల విషయంలో ఎంత రాద్ధంతం జరిగింది మరి వారిని ఎందుకు తీసేయలేదు. భారతరత్న, పద్మ అవార్డుల విషయంలో కూడా చాలా సార్లు విమర్శలు వచ్చాయి అవి తీసేశారా? అని సూటిగా ప్రశ్నలు ప్రశ్నించారు. నారా లోకేష్ మంత్రి కావడం తమ ఖర్మ అని పోసాని అన్నారు. లోకేష్ ముఖ్యమంత్రి అయితే... తాము తెలుగు రోహింగ్యాలమవుతామని చెప్పారు. తెలంగాణలో పన్నులు కడుతున్నందుకు... తాము ఏపీ గురించి మాట్లాడకూడదా? మీరు హైదరాబాద్‌లో పన్నులు కడుతూ విజయవాడలో కూర్చొని రాజకీయాలు చేయొచ్చా అని ప్రశ్నించారు.
 
"టెంపర్" సినిమాకు తనకు వచ్చిన ఉత్తమ సహాయ నటుడు అవార్డును తిరస్కరిస్తున్నట్లు పోసాని కృష్ణమురళి ఈ సందర్భంగా ప్రకటించారు. ‘ఈ  అవార్డు అందుకోవటానికి నేను సిగ్గుపడుతున్నా.. ఈ దేశం శాశ్వతం. అవినీతి డాం డాం అది నీకు ఉందోలేదో గుండేమీద చెయ్యివేస్కోమ్మని ఏపీ సీఎం చంద్రబాబుకు పోసాని సవాల్ విసిరారు. గుర్రం ఎగరావచ్చు. కమ్మవారు ఉండవచ్చు. వర్గానికి ఏ కులానికి సంబంధించినది కాదు. అందరి ఓట్లు కావాలి కాబట్టి, అందరినీ సమాంతరంగా చూడటమే ప్రజాస్వామ్యం. నంది అవార్డులు కాదు కమ్మ అవార్డులు.. అవార్డు తీసుకుంటే పోసాని కమ్మోడు కాబట్టే ఈ కమ్మ అవార్డు వాడికి ఇచ్చారు అంటారు. అందుకే ఈ అవార్డులను రద్దు చేయండి. చంద్రబాబుగారు చెప్పినట్టుగా ఐవీఆర్ఎస్ పద్దతిలో మరోసారి విజేతలను ఎంపిక చేయండి’ అంటూ పోసాని విజ్ఞప్తి చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నారా లోకేష్ బుద్ధిజ్ఞానం ఉందా? 'కమ్మ' నందిని తిరస్కరిస్తున్నా : పోసాని (వీడియో)