Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రధాని మోదీని పెళ్లాడుతా... రూ.2 కోట్లు కట్నమిస్తా... ఢిల్లీలో మహిళ దీక్ష

మౌన పోరాటం గురించి మనకు తెలుసు. ప్రేమించిన వాడి కోసం ప్రియురాలు చేసే పోరాటం ఇది. అలాంటి పోరాటాలు అప్పుడప్పుడు చూస్తూనే వుంటాం. ఇక తమకు కావాల్సింది దక్కకపోతే సగటు పౌరులు హస్తినకు వెళ్లి ప్రధాని దృష్టిలో పడేందుకు జంతర్ మంతర్ వద్ద దీక్షలు చేస్తుంటారు. ఇ

Advertiesment
prime minister
, శనివారం, 7 అక్టోబరు 2017 (15:40 IST)
మౌన పోరాటం గురించి మనకు తెలుసు. ప్రేమించిన వాడి కోసం ప్రియురాలు చేసే పోరాటం ఇది. అలాంటి పోరాటాలు అప్పుడప్పుడు చూస్తూనే వుంటాం. ఇక తమకు కావాల్సింది దక్కకపోతే సగటు పౌరులు హస్తినకు వెళ్లి ప్రధాని దృష్టిలో పడేందుకు జంతర్ మంతర్ వద్ద దీక్షలు చేస్తుంటారు. ఇప్పుడు ఇలాంటి దీక్ష ఓ మహిళ చేస్తోంది. కాకపోతే తను కోరుకుంటున్న కోర్కే డిఫరెంట్. అదేమిటంటే... ప్రధానమంత్రి మోదీని పెళ్లాడాలన్న కోర్కె. 
 
దాదాపు 45 ఏళ్లున్న మహిళ గత 30 రోజులుగా జంతర్ మంతర్ వద్ద ప్రధానిని పెళ్లాడుతానంటూ దీక్ష చేస్తోంది. ఈమె పేరు జయశాంతి. ఊరు రాజస్థాన్ లోని జైపూర్. తను ప్రధానిని పెళ్లాడాలని నిర్ణయించుకున్నాననీ, తన విజ్ఞప్తిని ప్రధాని అర్థం చేసుకుని పెళ్లాడుతారని భావిస్తున్నట్లు చెప్పుకొస్తోంది. అంతేకాదు.... ఆయన ఒప్పుకుంటే తనకున్న స్థిరాస్తి, నగలు అమ్మి రూ. 2 కోట్లు కట్నంగా ఇస్తానని కూడా చెప్తోంది. 
 
ఆయన పెళ్లాడేవరకూ ఇక్కడే దీక్ష చేస్తానని కుండబద్ధలు కొట్టి మరీ చెప్తోంది. ఇక్కడ నుంచి తనను ఎవరైనా కదిలిస్తే నేరుగా ప్రధాని మోదీ నివాసం ముందే దీక్షకు దిగుతానని వార్నింగ్ కూడా ఇచ్చేస్తోంది. ట్విస్ట్ ఏమిటంటే... ఈమెకు ఇంతకుముందే 1989లో పెళ్లయింది. ఆమె భర్త ఏమయ్యాడో తెలీదు. ఈ స్థితిలో ఆమెను పెళ్లాడేందుకు చాలామంది వచ్చారు కానీ ఎవ్వర్నీ చేసుకునేందుకు అంగీకరించలేదు. ఇప్పుడు ప్రధానమంత్రి మోదీనే చేసుకుంటానని దీక్ష చేస్తోంది. మరి ఈమె ఇలా దీక్ష ఎన్నాళ్లు చేస్తుందో?

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గరిటె తిప్పాలనుకుంటున్నా.. కిరణ్‌తో వివాహం పెద్దలు కుదిర్చిందే: మార్గదర్శి ఎండీ శైలజ