Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

గరిటె తిప్పాలనుకుంటున్నా.. కిరణ్‌తో వివాహం పెద్దలు కుదిర్చిందే: మార్గదర్శి ఎండీ శైలజ

ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు కోడలు శైలజా కిరణ్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. 'ఈనాడు' రామోజీరావు పెద్ద కుమారుడు కిరణ్ సతీమణి శైలజా కిరణ్‌కు వైసీపీ అధినేత జగన్ భార్య భారతితో మ

గరిటె తిప్పాలనుకుంటున్నా.. కిరణ్‌తో వివాహం పెద్దలు కుదిర్చిందే: మార్గదర్శి ఎండీ శైలజ
, శనివారం, 7 అక్టోబరు 2017 (15:19 IST)
ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు కోడలు శైలజా కిరణ్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. 'ఈనాడు' రామోజీరావు పెద్ద కుమారుడు కిరణ్ సతీమణి శైలజా కిరణ్‌కు వైసీపీ అధినేత జగన్ భార్య భారతితో మంచి సంబంధాలున్నాయని చెప్పుకొచ్చారు. ఈనాడుకు, సాక్షికి పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉందని.. అలాంటి పరిస్థితుల్లోనూ జగన్ భార్యతో తనకు మంచి సంబంధాలున్నాయని తెలిపారు. 
 
తనకు ఎవరితోనూ వ్యక్తిగత భేదాభిప్రాయాలు లేవని శైలజా కిరణ్ చెప్పారు. 'ఈనాడు'లో తమ ఛైర్మన్ రామోజీరావు దగ్గర నుంచి కింద స్థాయిలో పని చేసే ఉద్యోగి వరకు అందరం, అందరి పట్ల స్నేహ భావంతోనే మెలుగుతామని చెప్పారు. తమకు ఎవరి పట్ల శత్రుత్వం లేదని తెలిపారు. రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదన్నారు. రాజకీయాలంటేనే ప్రజలకు సేవ చేయడమని... ఇలాంటి అదృష్టం అందరికీ రాదని చెప్పారు.
 
చిన్నప్పటి నుంచి హాస్టల్‌లోనే పెరిగామని.. ఇంటికెళితే అమ్మ కిచెన్ వైపుకే రానివ్వదని.. అయితే చాలాకాలం తర్వాత కిచెన్‌లో గరిటె తిప్పాలనుకుంటున్నట్లు శైలజా తెలిపారు. అల్లుడు వచ్చారు కాబట్టి అతనికి వండి పెడదామని కోరికగా ఉందన్నారు. మనం సొంతంగా చేసే వంటలో అనురాగం కూడా కలుస్తుందని అన్నారు.

ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు పెద్ద కుమారుడు కిరణ్ దంపతులకు ముగ్గురూ అమ్మాయిలేనని అందరూ అనేవారు. అప్పట్లో తనకు బాబు వుంటే బాగుండేదని అనిపించేది. తాను, తన కుమార్తెలు కలసి ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు ఊహించని విధంగా కారు ఆగిపోతే, ఏదో భయం కలుగుతుందని, ఆ సమయంలో బాబు ఉంటే ధైర్యంగా ఉంటుందని ఆమె అన్నారు. 
 
కానీ ఆ విషయం గురించి మాట్లాడితే మా అమ్మాయిలకు కోపం వస్తుందన్నారు. తన ఉద్దేశం అమ్మాయిలకన్నా అబ్బాయిలు ఎక్కువ అనేది కాదని స్పష్టం చేశారు. అన్ని రంగాల్లోను అబ్బాయిలు, అమ్మాయిలు సమానంగానే రాణిస్తున్నారని తెలిపారు.

కోవైలో తాను ఎంబీఏ చేశానని.. అక్కడే కిరణ్ చదువుకున్నారని.. మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్ అన్నారు. వాస్తవానికి తాను కిరణ్‌ను క్యాంపస్‌‌‍లో కలవలేదని, కిరణ్ వెళ్లిపోయిన రెండేళ్లకి తాను ఆ కాలేజ్‌లో జాయిన్ అయ్యానని తెలిపారు. తమది లవ్ మ్యారేజ్ కాదని, పెద్దలు కుదిర్చిన పెళ్లంటూ చెప్పుకొచ్చారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కేసీఆర్ కళ్లు నెత్తికెక్కి మాట్లాడుతున్నారు.. తాగుబోతే నయం: రేవంత్ రెడ్డి ఫైర్