Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మహాత్ముడి ఆలోచనలు స్ఫూర్తిమంత్రం : ప్రధాని మోడీ

జాతిపిత మహాత్మాగాంధీ 148వ జయంతి సందర్భంగా సోమవారం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌తో కలిసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాజ్‌ఘాట్‌లో నివాళులర్పించారు. అలాగే, భారత రెండో ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రికి వ

మహాత్ముడి ఆలోచనలు స్ఫూర్తిమంత్రం : ప్రధాని మోడీ
, సోమవారం, 2 అక్టోబరు 2017 (10:21 IST)
జాతిపిత మహాత్మాగాంధీ 148వ జయంతి సందర్భంగా సోమవారం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌తో కలిసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాజ్‌ఘాట్‌లో నివాళులర్పించారు. అలాగే, భారత రెండో ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రికి విజయ్‌ఘాట్‌లో పుష్పాంజలి ఘటించారు.
 
ప్రధాని, రాష్ట్రపతిలతో పాటు ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, బీజేపీ సీనియర్ నేత ఎల్‌కే అడ్వాణీ తదితరులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గాంధీ జయంతి, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకల సందర్భంగా వారిని స్మరించుకుంటూ ప్రధాని మోడీ ట్విటర్లో పోస్టు చేశారు. మహాత్ముడి ఆలోచనలు ప్రపంచంలోని కోట్లాదిమందికి స్ఫూర్తిమంత్రమన్నారు. 
 
ఇకపోతే, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, చంద్రశేఖర్ రావులు బాపూజీకి నివాళులు అర్పించారు. అలాగే, ఏపీ విపక్ష నేత వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఘనంగా నివాళులర్పించారు. మహాత్మాగాంధీ జీవితం స్ఫూర్తిదాయకమని, ప్రతి ఒక్కరిలోనూ ఆ స్ఫూర్తి నిండాలని వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు. మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా ఆయనను స్మరించుకుందామంటూ ట్వీట్‌ చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పాక్‌తో పాటు టర్కీ, ఖతార్‌లు కూడా ఉగ్రదేశాలే... అమెరికా!