మేనల్లుడుతో అక్రమ సంబంధం .. మంచం కోడుతో భర్తను కొట్టి చంపేసిన భార్య!!

ఠాగూర్
గురువారం, 22 మే 2025 (09:00 IST)
ఓ వివాహిత తన మేనల్లుడుతో అక్రమ సంబంధం పెట్టుకుంది. ఈ విషయం కట్టుకున్న భర్తకు తెలిసింది. దీంతో భార్యను మందలించాడు. అయితే, మేనల్లుడు ద్వారా పొందుతున్న సుఖాన్ని వదులుకోలేని ఆ మహిళ.... కట్టుకున్న భర్తను హత్య చేసింది. భర్తకు మత్తు మందు ఇవ్వడంతో ఆయన గాఢ నిద్రలోకి జారుకున్నాడు. ఆ తర్వాత మంచం కోడుతో తలపై బాది చంపేసింది. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్‌లో వెలుగు చూసింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
కాన్పూర్‌కు చెందిన ధీరేంద్ర అనే ట్రాక్టర్ యజమాని ఈ నెల 11వ తేదీన ఇంట్లోనే హత్యకు గురయ్యాడు. దీనిపై మృతుని భార్య ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు వచ్చి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే, తన భర్తకు, పొరుగింటి వారికి ట్రాక్టర్‌ను పార్కింగ్ చేసే విషయంలో గొడవలు ఉన్నాయని, వారే తన భర్తను హత్య చేశారంటూ పోలీసులతో పాటు అందర్నీ భార్య నమ్మించింది. 
 
కానీ, పోస్టుమార్టం నివేదికలో ఆసలు విషయం వెలుగులోకి వచ్చింది. దర్యాప్తులో పోలీసులకు కొన్ని అనునాలు కూడా వచ్చాయి. తన భర్త హత్య ఇంటి బయట జరిగిందని భార్య రీనా పోలీసులకు చెప్పగా, ఫోరెన్సిక్ నిపుణుల తనిఖీలో ఇంటి లోపల జరిగిందని, ఇంటిలో రక్తపు మరకలు కూడా కనిపించాయని పేర్కొన్నారు. హత్యకు ఉపయోగించినట్టుగా భావిస్తున్న మంచం కోడు కూడా రక్తంతో తడిసివుంది. పైగా, హత్య జరిగిన రోజు రాత్రి రీనా.. తన మేనల్లుడు సత్యంతో దాదాపు 40 సార్లు ఫోను చేసి మాట్లాడినట్టు కాల్ డేటా ద్వారా పోలీసులు గుర్తించారు. 
 
ఈ క్రమంలో రీనాకు, ఆమె మేనల్లుడుకి అక్రమం సంబంధం ఉన్నట్టు పోలీసులు గ్రహించారు. దీంతో సత్యంను అదుపులోకి తీసుకుని విచారించగా, అసలు విషయం వెలుగు చూసింది. ధీరేంద్రకు మత్తు మందు ఇవ్వడంతో అతను గాఢనిద్రలోకి జారుకున్నాడని, ఆ తర్వాత రీనా.. మంచం కోడుతో ధీరేంద్ర తలపై కొట్టి చంపేసినట్టు సత్యం పోలీసులకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నేరాన్ని అంగీకరించాడు. దీంతో సత్యంతో పాటు రీనాను పోలీసులు అరెస్టు చేశారు. ఈ హత్య కేసులో తొలుత అరెస్టు చేసిన పొరుగింటి వారిని పోలీసులు విడుదల చేశారు. తమ వివాహేతర సంబంధం భర్త ధీరేంద్రకు తెలియడంతోనే హత్య చేసినట్టు రీనా అంగీకరించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bala Saraswati Devi : రావు బాలసరస్వతి గారు ఆత్మకు శాంతి చేకూరాలి: పవన్ కళ్యాణ్

Priyadarshi: ఏమీ చేయలేకపోతోన్నప్పుడు నెగెటివ్ కామెంట్లను చేస్తుంటారు : ప్రియదర్శి

గోపి గాళ్ల గోవా ట్రిప్.. కాన్సెప్ట్ చిత్రాలకు సపోర్ట్ చేయాలి : సాయి రాజేష్

Sudheer Babu: జటాధార తో సుధీర్ బాబు డాన్స్ లో ట్రెండ్ సెట్ చేస్తాడా...

Prabhas : రెబల్‌స్టార్ ప్రభాస్ సాలార్ రి రిలీజ్ కు సిద్దమైంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments