Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జ్యోతి మల్హోత్రా లగ్జరీ జీవితం వెనుక చీకటి కోణం : వామ్మో... విస్తుపోయే నిజాలు!

Advertiesment
jyothi malhotra

ఠాగూర్

, మంగళవారం, 20 మే 2025 (11:21 IST)
పాకిస్థాన్‌కు గూఢచర్యం చేసిన అరెస్టయిన హర్యానా రాష్ట్రానికి లేడీ యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా లగ్జరీ జీవితం వెనుక ఉన్న చీకటి కోణాలు వెలుగు చూస్తున్నాయి. ఆమె ఆదాయానికి మించి విలాసవంతమైన జీవితాన్ని అనుభవించారు. ఇపుడు ఈ లగ్జరీ జీవితంపైనే అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా, తన అదాయం అంతమాత్రం అయినప్పటికీ ఆమె మాత్రం పాకిస్థాన్, చైనా దేశాల్లో పర్యటించి లైఫ్‌ను ఎంజాయ్ చేశారు. అలాగే ఢిల్లీలోని పాక్ హైకమిషన్ అధికారి డానిష్‌తోనూ సన్నిహిత సంబంధాలు ఉన్నట్టు గుర్తించారు. పైగా, ఢిల్లీలో పాక్ ఎంబసీకి కేక్ తీసుకెళ్లిన వ్యక్తితో దిగిన ఫోటో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 
 
ఈ విలాసవంతమైన జీవితంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విమాన ప్రయాణాల్లో సైతం ఫస్ట్ క్లాస్‌లోనే ప్రయాణించినట్లు సమాచారం. ఖరీదైన హోటళ్లలో బస చేయడం, ప్రముఖ రెస్టారెంట్లలోనే భోజనం చేయడం వంటివి ఆమె జీవనశైలిలో భాగంగా మారాయి. జ్యోతి పాకిస్థాన్ పర్యటన ఖర్చులన్నీ స్పాన్సర్లే భరించినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. పాక్ పర్యటన ముగించుకుని వచ్చిన వెంటనే ఆమె చైనాకు కూడా వెళ్లినట్లు తేలింది. అక్కడ కూడా విలాసవంతమైన కార్లలో తిరగడం, ఖరీదైన నగల దుకాణాలను సందర్శించడం వంటివి చేసినట్లు ఆధారాలు లభ్యమయ్యాయి.
 
ఈ యేడాది జనవరిలో జ్యోతి మల్హోత్రా కాశ్మీర్‌లోని పహల్గాం ప్రాంతంలో పర్యటించినట్లు పోలీసులు నిర్ధారించారు. ఆ పర్యటన జరిగిన మూడు నెలల వ్యవధిలోనే అక్కడ ఉగ్రదాడి జరగడం గమనార్హం. ఐదు రోజుల కాశ్మీర్ పర్యటనలో భాగంగా ఆమె పహల్గాం వెళ్లి, అక్కడ పలు వీడియోలు చిత్రీకరించింది. ఈ వీడియోలను పాక్ ఏజెంట్లకు చేరవేసిందా? పహల్గాం ఉగ్రదాడికి, జ్యోతి పర్యటనకు ఏమైనా సంబంధం ఉందా? అనే కోణంలో అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఆమె ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను నిలిపివేశారు. జ్యోతికి చెందిన సెల్‌ఫోన్, ల్యాప్‌టాప్‌లను స్వాధీనం చేసుకున్న తర్వాత పలు అనుమానాస్పద అంశాలు వెలుగుచూశాయని పోలీసులు తెలిపారు.
 
'ఆపరేషన్ సిందూర్' సమయంలోనూ జ్యోతి ఢిల్లీలోని పాక్ ఎంబసీ అధికారి దానిష్‌తో సంప్రదింపులు జరిపినట్లు గుర్తించారు. డానిష్ ఆమెకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని భావిస్తున్నారు. పహల్గాం ఉగ్రదాడి జరిగిన రెండు రోజుల తర్వాత, ఏప్రిల్ 24న ఢిల్లీలోని పాక్ ఎంబసీకి గడ్డంతో ఉన్న ఒక వ్యక్తి కేక్ తీసుకువస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. అక్కడున్న విలేకరులు 'ఎందుకు వచ్చావు? ఎందుకోసమని ఈ కేక్?' అని ప్రశ్నించగా.. ఆ వ్యక్తి సమాధానం చెప్పకుండా వేగంగా లోపలికి వెళ్లిపోయాడు. ఈ గడ్డం వ్యక్తితో జ్యోతి మల్హోత్రా దిగిన ఫొటో కూడా సోషల్ మీడియాలో చక్కర్ల కొడుతోంది. పాకిస్థాన్ పర్యటనలో జ్యోతి హాజరైన ఒక వేడుక వీడియోలో కూడా ఈ వ్యక్తి కనిపించాడు. వీడియోలో జ్యోతి ఆ వ్యక్తిని కలిసినట్లు స్పష్టంగా ఉంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆగివున్న లారీని ఢీకొట్టిన బస్సు - నలుగురి దుర్మరణం!!