Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నారాయణపూర్ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ - 28 మంది మృతి

Advertiesment
encounter

ఠాగూర్

, బుధవారం, 21 మే 2025 (14:05 IST)
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని నారాయణపూర్ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో ఏకంగా 28 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు ఉన్నట్టు సమాచారం. మరికొందరు మావోలు కూడా గాయపడినట్టు సమాచారం. 
 
మాధ్ ప్రాంతంలో మావోయిస్టుల ఉన్నారన్న పక్కా సమాచారంతో సాయుధ బలగాలు ఈ ఆపరేషన్ చేపట్టాయి. బీజాపూర్‌, నారాయణపూర్, దంతెవాడ డీఆర్జీ బలగాలు ఆపరేషన్‌లో పాల్గొన్నాయి. ఈ ప్రాంతంలో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య ఇంకా ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. దీంతో మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది. 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భారతీయుల ఆగ్రహం: ఛీ.. ఛీ.. మీ దేశం ముఖం చూడం, టర్కీకి 11,000 కోట్లు నష్టం