Webdunia - Bharat's app for daily news and videos

Install App

వ్యాక్సిన్ స‌ర్టిఫికెట్ షేర్ చేస్తే చిక్కుల్లో ప‌డ్డ‌ట్టే!

Webdunia
గురువారం, 27 మే 2021 (11:22 IST)
కోవిడ్-19 వ్యాక్సిన్ సర్టిఫికేట్‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేయ‌వ‌ద్ద‌ని హోం మంత్రిత్వ శాఖ తెలిపింది. దానిలో టీకా తీసుకున్న వ్య‌క్తి పేరు, ఇతర వ్యక్తిగత వివ‌రాలు ఉంటాయ‌ని పేర్కొంది. మోస‌గాళ్లు ఎవ‌రైనా ఈ సమాచారాన్ని దుర్వినియోగం చేసే అవ‌కాశాలున్నాయ‌ని పేర్కొంది.

అందుకే ఈ విష‌యంలో జాగ్రత్తగా ఉండాల‌ని పేర్కొంది. కాగా సైబర్ దోస్త్‌ అనేది ప్ర‌భుత్వ అధికారిక ట్విట్టర్ ఖాతా. దీనిని సైబర్ సెక్యూరిటీపై ప్ర‌జ‌ల‌కు అవగాహన  క‌ల్పించేందుకుహోం వ్యవహారాల మంత్రిత్వశాఖ నిర్వ‌హిస్తోంది.
 
దేశంలో క‌రోనా క‌ట్ట‌డికి వ్యాక్సినేషన్ డ్రైవ్ కొన‌సాగుతోంది. ప్రస్తుతం దేశంలో 18 ఏళ్ల వ‌య‌సు దాటిన వారందరికీ టీకాలు వేస్తున్నారు. ఈ నేప‌ధ్యంలో వ్యాక్సినేషన్ స్లాట్‌ బుక్ చేయడంలో ప‌లు ఇబ్బందులు ఎదుర‌వుతున్నాయి. కోవిడ్-19 వ్యాక్సిన్ వేసిన త‌రువాత సంబంధిత వ్య‌క్తికి ప్రభుత్వం వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ జారీ చేస్తుంది.

దీనిని కొంద‌మంది సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. అయితే తాజాగా హోం మంత్రిత్వ శాఖ త‌న సైబర్ దోస్త్‌ ఖాతా నుంచి ఒక హెచ్చ‌రిక చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏడాది క్రితం ట్వీట్స్ పెడితే ఇప్పుడు మనోభావాలు దెబ్బతినడం ఏంటి: వర్మ లాజిక్

నితిన్, శ్రీలీల రాబిన్‌హుడ్ నుంచి క్వీన్ విద్యా వోక్స్ పాడిన సాంగ్ రిలీజ్

తల్లి మనసు సినిమాకు సెన్సార్ సభ్యుల ప్రశంసలు

అఖిల్ అక్కినేని, జైనాబ్ రావ్‌జీల నిశ్చితార్థం చేశామన్న నాగార్జున

రోటి కపడా రొమాన్స్‌ బాగా లేదంటే సినిమాలకు రిటైర్‌మెంట్‌ : దర్శకుడు విక్రమ్‌ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments