ఆంధ్రప్రదేశ్‌లో భానుడి సెగ.. వడగాలులు తప్పవు.. 3 రోజులు బయటికి రావొద్దు

Webdunia
గురువారం, 27 మే 2021 (11:17 IST)
ఆంధ్రప్రదేశ్‌లో భానుడు భగభగమంటున్నాడు. యాస్ తుఫాన్ ప్రభావంతో రెండు రోజులు వాతావరణం కాస్త చల్లబడినా… మళ్లీ వాతావరణం వేడెక్కింది. వచ్చే నాలుగు రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశమున్నట్లు రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ ప్రకటించింది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, అత్యవసరం అయితే తప్ప ఇంట్లో నుంచి బయటకు రావొద్దని సూచించింది.
 
గురువారం (మే 27,2021) తూర్పుగోదావరి జిల్లాలో 12, విజయనగరం జిల్లాలో 2 మండలాల్లో తీవ్ర వడగాలులు వీస్తాయని విపత్తు నిర్వహణ శాఖ తెలిపింది. పశ్చిమగోదావరి జిల్లాలో 36, కృష్ణాలో 15 మండలాలు మిగిలిన చోట్ల.. మొత్తం 68 మండలాల్లో వడగాలుల తీవ్రత ఉంటుందన్నారు. 
 
ఇక శుక్రవారం తూర్పుగోదావరి 3 మండలాల్లో, శనివారం తూర్పుగోదావరి 28, పశ్చిమగోదావరి 18, విజయనగరంలో 14 మండలాలు మిగిలిన చోట్ల మొత్తం 63 మండలాల్లో వడగాలులు వీచే అవకాశమున్నట్లు విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరించింది. 
 
ఎండలు, వడగాలుల తీవ్రత అధికంగా ఉండే అవకాశముండటంతో ప్రజలు ఎవరూ బయటకు రావొద్దని.. అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం హెచ్చరించింది. అత్యవసరం అయితే బయటకు రావొద్దంది. అలాంటి సందర్భంలో ఎండ తీవ్రత, వడగాలుల బారిన పడకుండా ఉండేలా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన బాలీవుడ్ నటి పరణీతి చోప్రా

అవార్డులను చెత్త బుట్టలో పడేస్తా : హీరో విశాల్

Meesala Pilla: చిరంజీవి చరిష్మా అలాంటింది.. ఇండియన్ టాప్ ట్రెండింగ్‌లో మీసాల పిల్ల (video)

ఆర్టిస్టుల సమస్యలను దాటి తెరకెక్కిన పండంటి కాపురం ఒక తెలుగు క్లాసిక్

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇంట్లో దీపావళి పార్టీ కారణం అదే..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments