Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సమస్యాత్మక ప్రాంతాల్లో అవసరమైతే కేంద్రబలగాల సాయంతో ఎన్నికలు: టీడీపీ

సమస్యాత్మక ప్రాంతాల్లో అవసరమైతే కేంద్రబలగాల సాయంతో ఎన్నికలు: టీడీపీ
, మంగళవారం, 2 ఫిబ్రవరి 2021 (10:33 IST)
తొలిదశ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ఘట్టం విప్లవాత్మక మార్పుతోపూర్తయిందని, గతంలో ఎంపీటీసీఎన్నికల్లో 16 నియోజకవర్గాల్లో 85శాతం కంటే ఎక్కువ ఏకగ్రీవాలు అయ్యాయని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు తెలిపారు. 

కానీనేడు అవే ప్రాంతాల్లో టీడీపీకి చెందిన సానుభూతిపరులు, మద్ధతుదారులు ఒక్కో పంచాయతీకి ఆరుగురువరకు నామినేషన్లు వేశారన్నారు. వైసీపీప్రభుత్వం బలవంతపు ఏకగ్రీవాలు చేయాలని, ఏకగ్రీవాల పేరుతోఇచ్చే సొమ్ముతో ప్రతిపక్షపార్టీలకు చెందిన మద్ధతుదారులను ప్రలోభపెట్టాలని చూస్తున్నారన్నారు.

ఏకగ్రీవం అనేది పంచాయతీలోని పెద్దలంతా కలిసి తీసుకునే నిర్ణయమని, అందుకు విరుద్ధంగా ప్రభుత్వం బలవంతపు ఏకగ్రీవాలు చేయడానికి ప్రయత్నిస్తోందన్నారు.

గతంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ వెలువడినప్పుడు, ప్రభుత్వం ఏఏప్రాంతాల్లోనైతే, బలవంతపు ఏకగ్రీవాలుచేసిందో, నేడు ఆయాప్రాంతాల్లో పంచాయతీఎన్నికలు జరగబోతున్నాయన్నారు.

3,251 పంచాయతీల్లో 20వేలు, 32వేలవార్డులకు 80వేల నామినేషన్లు పడటం జరిగిందన్నారు. ప్రజాస్వామ్యానికి ఇది మంచి శుభపరిణామమన్న అశోక్ బాబు, రాజకీయంగా, కక్షపూరి తంగా పంచాయతీ ప్రెసిడెంట్ పదవిని వాడుకోవాలని చూడటం వల్ల గ్రామాల్లో విద్వేషాలు, కక్షలు పెరుగుతాయన్నారు.

ఏపీలో పంచాయతీ ఎన్నికల ఆరంభంతో నూతనశకం మొదలైందని, గతంలో ఎన్నికలువాయిదాపడటం, ఆనాడు ప్రభుత్వం వ్యవహ రించిన తీరుతో ప్రజల్లో చాలావరకు చైతన్యం వచ్చిందన్నారు.

ఇప్ప టికీ ప్రభుత్వం అనేకప్రాంతాల్లో సర్చంచ్ అభ్యర్థులుగా పోటీచేస్తున్న వారిని కిడ్నాప్ చేయడం, బెదిరించడం, ప్రలోభపెట్టడం వంటివి జరుగుతూనే ఉన్నాయన్నారు.

అచ్చెన్నాయుడి కారుపై వైసీపీనేత దువ్వాడ శ్రీనివాస్ దాడికి యత్నించడం, చిత్తూరులో టీడీపీ ఎమ్మెల్సీపైదాడికి పాల్పడటం వంటివాటిపై ఎస్ఈసీకి ఫిర్యాదుచేసి నట్టు అశోక్ బాబు తెలిపారు. దౌర్జన్యపూరతి, దుర్మార్గపు వాతావర ణాన్ని ప్రభుత్వం పల్లెల్లో కల్పించిందన్నారు.

రాష్ట్రప్రభుత్వ నిర్వాకం కారణంగా పంచాయతీలకు చెందాల్సిన దాదాపు రూ.5 వేలకోట్లు సొమ్ము రంగులపాలైందన్నారు. సర్పంచ్ ల పాలన పల్లెల్లో మొద లైతే, ప్రభుత్వం రంగులకు ఖర్చుచేసిన నిధులపై వారు ఎక్కడ తమను నిలదీస్తారోననే భయం ప్రభుత్వానికి ఉందన్నారు.

పంచాయతీల్లో సర్పంచ్ ల పాలన ప్రారంభమైతే, 14వ, 15వ ఆర్థిక సంఘం నిధులను ప్రభుత్వం ఇష్టమొచ్చినట్లు వాడుకోవడం కుదర  దు కాబట్టే, నేడు పాలకులు ఏకగ్రీవాలను తెరపైకి తీసుకొచ్చారని అశోక్ బాబు స్పష్టంచేశారు.

ఇప్పటికీ చాలా చోట్ల పోలీసులు ప్రభు త్వానికి వంతపాడుతున్నారని, నిమ్మాడలో అచ్చెన్నాయుడిపై, దువ్వాడ శ్రీనివాస్ దాడిచేస్తున్నప్పుడు, స్థానికసీఐ, ఎస్ఐలు పక్కనే ఉండి నవ్వుకుంటున్నారన్నారు.

అటువంటి ఘటనలు చూశాక పోలీసుల తీరుపై తాము ఎస్ఈసీకి ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. సున్నితమైన, సమస్యాత్మక ప్రాంతాల్లో కేంద్ర బలగాలతో ఎన్నికలుజరిగేలా చూడాలని కూడా తాము కోరడం జరిగిందన్నారు.

నామినేషన్లు చించేయడం వంటి ఘటనల దృష్ట్యా, ఆన్ లైన్లో నామినేషన్లుసమర్పించేలా చర్యలు తీసుకోవాలని కూడా తాము ఎస్ఈసీకి విజ్ఞప్తిచేశామన్నారు.

కేంద్రప్రభుత్వ బలగాలు, రాష్ట్రంలోని ఆర్మ్ డ్ రిజర్వ్ బలగాల సాయంతో గుంటూరులోని పల్నాడు, రాయల సీమప్రాంతాల్లో ఎన్నికలు జరిగేలా చూడాలని కోరామన్నారు.

గతంలో  ఎంపీటీసీలు, జడ్పీటీసీలు ఎక్కడైతే ప్రభుత్వం ఏకగ్రీవాలకు పాల్పడిందో, ఆయాప్రాంతాల్లో నేడు టీడీపీ తరుపున, నామినేషన్లువేసిన వారందరికీ కృతజ్ఞతలు చెబుతున్నామన్నారు.

డీజీపీ తనవైఖరి మార్చుకోకుంటే, ఆయన్ని కూడా బదిలీచేయాలని తాము ఎస్ఈసీని కోరుతామన్నారు. నరేగా నిధులు రావని, తమప్రభుత్వం టీడీపీవారికిచెల్లించదని అనేకచోట్ల బెదిరించినా కూడా,  ప్రతిపక్షానికి చెందిన సానుభూతిపరులు నామినేషన్లు వేశారన్నారు.

కేంద్రం ప్రకటించిన బడ్జెట్లో రూరల్ ప్రాంతాలకు దాదాపు రూ.60వేలకోట్లు కేటాయించిందని, రాష్ట్రంలో 13 వేలపంచాయతీలుంటే, సంవత్సరానికి కోటిరూపాయలు చొప్పునవేసుకున్నా, ప్రతిపంచాయతీకి ఐదేళ్లలో రూ.5కోట్ల చొప్పున, రూ.65వేలకోట్లవరకు  నిధులొచ్చే అవకాశముందన్నారు.

ప్రభుత్వం పంచాయతీ నిధులను సక్రమంగా పల్లెలకు ఖర్చుచేస్తే, వాటి రూపురేఖలు చాలా వరకు మారిపోతాయన్నారు.

గతంలో టీడీపీప్రభుత్వం 25వేలకిలోమీటర్లవరకు సీసీరోడ్లు వేసిందని, ఎన్ఆర్ఈజీఎస్ నిధులను అధికంగా రాబట్టింది కూడా రాష్ట్రమేనన్నారు.

పంచాయతీల నిధులు వాటికి ఉపయోగించడం ఇష్టంలేకనే ప్రభుత్వం, కరోనా వ్యాక్సిన్ సాకుగాచూపి, ఎన్నికలు వాయిదా వేయాలనిచూసిందన్నారు. ఎవరైతే పంచాయతీ కోసం పాటుపడతారో, వారంతా గెలిచి వారి గ్రామాలను అభివృద్ధిచేసు కోవాలని టీడీపీ తరుపున విజ్ఞప్తిచేస్తున్నామన్నారు.

పల్లెల్లో ప్రజలు నిజాయితీగా పనిచేసేవారికే ఓటువేయాలన్నారు. రాబోయే దశల్లో కూడా టీడీపీ సానుభూతిపరులు పల్లెల్లో అధికంగా నామినే షన్లు వేసి, ప్రభుత్వ దురహంకారాన్ని అణచివేయాలని అశోక్ బాబు విజ్ఞప్తిచేశారు.

అచ్చెన్నాయుడిపై దాడిచేసిన దువ్వాడ శ్రీని వాస్ వ్యవహారశైలిపై ఎస్ఈసీకి ఫిర్యాదుచేశామని, ప్రభుత్వం ఇటువంటి చర్యలతో టీడీపీకి, ఆపార్టీనేతలకు మరింతబలాన్ని ఆపాదించి పెడుతోందని అశోక్ బాబు అభిప్రాయపడ్డారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చిత్తూరు జిల్లాలో ఆరుగురు ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్ట్‌