Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రౌడీ షీటర్లను ముందుగా బైండోవర్‌ చేశాం: కృష్ణాజిల్లా ఎస్పీ ర‌వీంద్ర‌నాథ్‌

రౌడీ షీటర్లను ముందుగా బైండోవర్‌ చేశాం: కృష్ణాజిల్లా ఎస్పీ ర‌వీంద్ర‌నాథ్‌
, శుక్రవారం, 29 జనవరి 2021 (21:49 IST)
ప్రజలను ప్రలోభాలకు గురి చేసే, అక్రమ నగదు, మద్యం సరఫరాకు సంబంధించిన ఏదైనా సమాచారం తెలియజేయాలంటే 9491068906కి ఫోన్ చేయాలనీ, కృష్ణా జిల్లాలో ఎన్నికలను నిష్పక్షపాతంగా, ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని చర్యలు చేపట్టామని జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు వెల్లడించారు.
 
ఈ సంద‌ర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికలు మొత్తం నాలుగు విడతల్లో జరగనున్నాయని... మొదటి విడత నామినేషన్ ప్రక్రియ శుక్ర‌వారం నుంచి మొదలయిందని పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా 52 లొకేషన్లలో 76 సమస్యాత్మక ప్రదేశాలని గుర్తించామని తెలిపారు.
 
రౌడీ షీటర్లను, వివాదాస్పద నాయకులను ముందుగా బైండోవర్ చేశామన్నారు. లైసెన్స్ వెపన్ ఉన్న వారి నుండి వెపన్‌ను హ్యాండోవర్‌ చేసుకొని హెడ్ క్వాటర్‌కి డిపాజిట్ చేశామన్నారు. 
 
నాలుగు దశల ఎన్నికల విధులకు జిల్లా వ్యాప్తంగా 2200 మంది పోలీస్ సిబ్బందిని కేటాయించామన్నారు. రిటైర్డ్ పోలీస్ అధికారులు, ఎక్స్ ఆర్మీ, ఎక్స్ సీఆర్పిఎఫ్ సిబ్బంది సహాయం తీసుకుంటున్నామని పేర్కొన్నారు. పరిస్థితిని పర్యవేక్షించేందుకు డీఎస్పీ స్థాయి అధికారిని నియమించామని, 24 గంటల పర్యవేక్షణకు 9491068906 టోల్ ఫ్రీ నంబర్‌ను ఏర్పాటు చేశామన్నారు. 
 
ప్రజల యొక్క ఓటు హక్కును సక్రమంగా, స్వేచ్ఛగా వినియోగించుకునే అవకాశం లేకుండా చేయాలని చూస్తే చట్టప్రకారం వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ప్రశాంతమైన, స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరగడానికి పూర్తి చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నిజాయితీని నిరూపించుకున్న ఆటో డ్రైవర్.. 50 సవర్ల బంగారాన్ని ఏం చేశాడంటే?