Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ ఎద్దు మాట్లాడగలిగితే మంచి సలహా ఇస్తుందని పందెం కాస్తున్నా : ఆనంద్ మహీంద్రా

వరుణ్
బుధవారం, 31 జనవరి 2024 (10:37 IST)
సోషల్ మీడియాలో నిత్యం ఎంతో యాక్టివ్‌గా ఉండే దేశ పారిశ్రామికవేత్తల్లో ఒకరైన మహీంద్రా గ్రూపు అధినేత ఆనంద్ మహీంద్రా తాజాగా తన ఎక్స్ ఖాతాలో ఓ ఎద్దు వీడియోను పోస్ట్ చేశారు. ఎవరి నియంత్రణ లేకుండానే అది బండి లాగడం వంటి పనులు చేస్తుంది. అలాగే, కాడిని ఎత్తుకోవడం మొదలు, అప్పగించిన పనులను తనంతట తాను నిర్వహిస్తుంది. ఇది ఆనంద్ మహీంద్రాను అమితంగా ఆకర్షించింది. దీన్ని తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసిన ఆయన.. "ఒకవేళ రాము (ఎద్దు) మాట్లాడగలిగితే జీవితంలో సానుకూలంగా ఎలా ఉండాలనే దానిపై ప్రపంచంలోని వక్తలందరూ ఇచే దానికంటే మంచి సలహా ఇస్తుందని పందెం కాస్తున్నా" అంటూ కామెంట్స్ చేశారు. 
 
కాగా, పంజాబ్ రాష్ట్రంలోని ఓ ఆశ్రమానికి చెందిన ఈ ఎద్దు.. ఇతరుల ప్రమేయం, నియంత్రణ లేకుండా బండిని లాగుతూ అవసరమైతే రివర్స్ తీసుకుంటూ పశువుల దాణా, ఇతరత్రా సామాగ్రిని సరైన చోటికి చేరుస్తూ ఈ వీడియోలో కనిపించింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో నెటిజన్లు కూడా తమకు తోచిన విధంగా స్పందిస్తున్నారు. కృత్రిమమేథ సాంకేతికత కంటే రాము మెరుగ్గా పని చేస్తుందని ఓ నెటిజన్ స్పందించారు. దీన్ని సంస్థలో నియమించుకోవాలని, లేకపోతే మహీంద్రా ఆటో, టెంపో స్థానంలో వచ్చేస్తుందని మరో నెటిజన్ సరదాగా కామెంట్ చేశాడు. 
 
ఎమ్మెల్సీ ప్రమాణ స్వీకారంపై తప్పుడు ప్రచారం చేయొద్దని గుత్తా మీడియాకు విజ్ఞప్తి 
 
తెలంగాణ రాష్ట్ర శాసనమండలికి కొత్తగా ఇద్దరు ఎమ్మెల్సీ ఎన్నికయ్యారు. గవర్నర్ కోటాలో వీరిద్దరిని ఎంపిక చేశారు. వీరిలో ఒకరు తెలంగాణ ఉద్యమ నేత ప్రొఫెసర్ కోదండరామ్ కాగా, మరొరు కాంగ్రెస్ సీనియర్ నేత అమీర్ అలీఖాన్. అయితే, వీరు ప్రమాణ స్వీకారం చేయడానికి వెళ్లే మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి లేరు. దీనిపై మీడియాలో పలు రకాలైన కథనాలు వచ్చాయి. దీంతో గుత్తా సుఖేందర్ రెడ్డి స్పందించారు. వారు తనకు సమాచారం ఇవ్వకుండా మండలికి వచ్చారని, ఈ అంశంపై తప్పుడు ప్రచారం చేయొద్దని ఆయన మీడియాను కోరారు. 
 
ఎమ్మెల్యే కోటా కింద ఎన్నికైన మహేశ్ కుమార్ గౌడ్ మాత్రమే ప్రమాణ స్వీకారానికి సమయం ఇవ్వాల్సిందిగా తనను అడిగారని... ఈ నెల 31న మధ్యాహ్నం మూడున్నర గంటలకు వస్తానని చెబితే తాను అంగీకరించానని తెలిపారు. అదేరోజు మిగతా ఎమ్మెల్సీతోనూ ప్రమాణం చేయించేలా ఏర్పాట్లు చేయాలని తాను అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. కానీ ఈ రోజు కోదండరామ్, అమీర్ అలీఖాన్ సమాచారం ఇవ్వకుండానే ప్రమాణం కోసమంటూ తన కార్యాలయానికి వచ్చారని పేర్కొన్నారు.
 
మండలి చైర్మన్‌గా తాను నిష్పక్షపాతంగా వ్యవహరిస్తానని స్పష్టం చేశారు. మీడియా తొందరపడి తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేయవద్దని కోరారు. ఈ నెల 25వ తేదీ నుంచి తాను గొంతు నొప్పి, దగ్గు, జ్వరంతో బాధపడుతున్నానన్నారు. వైద్యుల సూచనతో ఆ రోజు నుంచి తాను ఏ కార్యక్రమంలో పాల్గొనలేదని తెలిపారు. రిపబ్లిక్ డే సందర్భంగా గవర్నర్ ఇచ్చిన తేనీటి విందుకు కూడా హాజరు కాలేదని గుర్తు చేశారు. 
 
ఈ నెల 27, 28, 29 తేదీలలో ముంబైలో జరుగుతోన్న ఆల్ ఇండియా ప్రిసైడింగ్ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్‌కు కూడా వెళ్లలేదన్నారు. అయితే ఎమ్మెల్సీగా ప్రమాణం చేసేందుకు మహేశ్ కుమార్ గౌడ్ మాత్రం సమయం అడిగారని... ఆయన ఈ నెల 31న మధ్యాహ్నం ప్రమాణం చేస్తారని తెలిపారు. కానీ గవర్నర్ కోటా కింద నియమితులైన ఎమ్మెల్సీలు తనకు సమాచారం ఇవ్వకుండా తన కార్యాలయానికి వస్తే తానేం చేయగలనని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అందం కోసం సర్జరీ చేయించుకున్న మౌనీ రాయ్?

మంచు మనోజ్‌ను చూసి బోరున ఏడ్చేసిన మంచు లక్ష్మి! (Video)

చియాన్ విక్రమ్‌ తనయుడితో మలయాళ బ్యూటీ డేటింగ్!!

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments