Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

టీమిండియా ఓటమి నుంచి నేర్చుకున్నది ఇదే.. ఆనంద్ మహీంద్రా ట్వీట్

anand mahindra
, సోమవారం, 20 నవంబరు 2023 (11:08 IST)
ఐసీసీ వన్డే ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్‌లో భారత క్రికెట్ జట్టు ఆస్ట్రేలియా జట్టు చేతిలో ఓడిపోయింది. దీంతో కోట్లాది మంది భారతీయులు తీవ్ర నిరాశకు లోనయ్యారు. ఇలాంటి వారిలో పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా కూడా ఒకరు. అయితే, భారత ఓటమిపై ఆయన తనదైనశైలిలో స్పందించారు. టీమిండియా ఊహించిన దానికంటే అద్భుతంగా రాణించిందంటూ కితాబిచ్చారు. అందువల్ల కష్టసమయంలో వారికి భారతీయులంతా మద్దతుగా, అండగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. గెలుపోటములు, జీవిత సత్యాల గురించి ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 
 
"అణుకువ, వినయం నేర్పించడంలో క్రీడలకు మించిన గురువు ఎవరూ లేరు. అయితే, ఏ రకంగా చూసినా భారత క్రికెట్ జట్టు అద్భుతంగా రాణించింది. ఆశించిన దానకింటే ఎక్కువ విజయాలే సొంతం చేసుకుంది. ఈ సమయంలో మనమందరం భారత క్రీడాకారులకు అండగా నిలవాలి. కానీ, జీవితంలో ముందుకు సాగాలంటే ఓటమిని కూడా అంగీకరించాలి. స్వీకరించాలని. ఆ భావాన్ని దాచిపెట్టే ప్రయత్నం చేయకూడదు. నేను నేర్చుకున్నది ఇదే. కాబట్టి నా పరిస్థితిని ప్రతిబింభించేలా ఈ చిత్రాన్ని షేర్ చేస్తున్నా" అంటూ ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేస్తూ దానికి ఓ ఫోటోను జత చేశాడు. మరో అవకాశం, అద్భుతం కోసం ఒంటరిగా ఎదురు చూస్తున్న ఓ వ్యక్తి ఫోటోను షేర్ చేశారు. ఈ పోస్టుకు నెటిజన్లు ఫిదా అయిపోయారు. ఎప్పటిలా ఆనంద్ మహీంద్రాపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కాగా, ఈ ప్రపంచ కప్ మ్యాచ్‌ను ఆనంద్ మహీంద్రా ప్రత్యక్షంగా వీక్షించక పోవడం గమనార్హం. 
 
మ్యాచ్‌ను మలుపుతిప్పింది రోహిత్ క్యాచ్ : ట్రావిస్ హెడ్  
 
మొతేరా స్టేడియంలో ఆదివారం రాత్రి భారత్ - ఆస్ట్రేలియా క్రికెట్ జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌‍లో కంగారులు ఆరు వికెట్ల తేడాతో గెలుపొంది మరోమారు విశ్వవిజేతగా నిలిచారు. ఆస్ట్రేలియాను మాత్రం ఓపెనర్ ట్రావిడ్ హెడ్ గెలిపించాడు. భారత బౌలర్ల పాలిట సింహస్వప్నంలా మారి సెంచరీ కొట్టి నాటౌట్‌గా నిలిచాడు. కప్ గెలిచిన తర్వాత హెడ్ మీడియాతో మాట్లాడుతూ, మ్యాచ్‌ను మలుపుతిప్పింది భారత కెప్టెన్ రోహిత్ శర్మ క్యాచ్ అని అన్నాడు. రోహిత్ క్యాచ్‌ను పడతానని అస్సలు అనుకోలేదన్నాడు. 
 
"మిచెల్ మార్ష్ పెవిలియన్ చేరాక వికెట్ కఠినంగా ఉందని అర్థమైందన్నారు. టాస్ గెలిచిన తర్వాత ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయం తీసుకోవడం గొప్ప విషయం. మ్యాచ్ గడిచే కొ1ద్దీ వికెట్ మెరుగైంది. పిచ్ మధ్యలో కొద్దిగా స్పిన్‌కు అనుకూలించింది. సెంచరీ చేయడం, రోహిత్ శర్మ క్యాచ్ పట్టడం నేను అస్సలు ఊహించలేదు. బహుశా ప్రపంచంలోకెల్లా అత్యంత దురదృష్టవంతుడు రోహిత్ శర్మయేనేమో అన్నాడు. అలాగే, ఫైనల్స్‌లో సెంచరీ చేసిన తమ దేశ ఆటగాళ్లు రికీ పాంటింగ్, ఆడమ్ గిల్‌క్రిస్ట్ తర్వాత స్థానంలో తాను ఉన్నారు. మొత్తానికి ఈ టోర్నీ తనకు ఎంతో ఆనందాన్ని మిగిల్చింది అని హెడ్ చెప్పుకొచ్చాడు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మి కార్టర్ భార్య రోజలిన్ మృతి