Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వెస్టిండీస్ ఉచ్ఛస్థితిలోనూ ఈ స్థాయి దాడి చూడలేదు : భారత బౌలింగ్‌పై ఆనంద్ మహీద్రా ట్వీట్

Advertiesment
anand mahindra
, శుక్రవారం, 3 నవంబరు 2023 (09:01 IST)
ఒకపుడు క్రికెట్ ప్రపంచాన్ని గడగడలాడించిన వెస్టిండీస్ జట్టు బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ ఇలా ఉన్న విభాగాల్లో ఉచ్ఛస్థితిలో ఉన్నపుడు కూడా ఈ స్థాయి దాడి చూడలేదని భారత పాశ్రమికదిగ్గజం ఆనంద్ మహీంద్రా వ్యాఖ్యానించారు. ఐసీసీ వన్డే ప్రపంచ కప్ టోర్నీలో భాగంగా, గురువారం ముంబై వేదికగా భారత్, శ్రీలంక జట్ల మధ్య కీలకపోరు జరిగింది. ఇందులో భారత్ తొలుత బ్యాటింగ్ చేసి 357 పరుగులుచేసింది. ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన శ్రీలంక జట్టు కేవలం 55 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్ల భీకర ధాటికి లంకేయులు వరుసగా ఒకరి వెంట ఒకరు పెవిలియన్‌కు క్యూకట్టారు. దీనిపై పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు. 
 
"భారత బౌలర్లు శ్రీలంకను భయభ్రాంతులకు గురిచేశారన్నారు. వెస్టిండీస్ టీం ఉచ్ఛస్థితిలో ఉన్న రోజుల్లోనూ వారి బౌలర్లు ప్రత్యర్థి టీం వికెట్లు ఈ రీతిలో కూల్చారని నేను అనుకోను. మనోళ్లు నిజంగా శ్రీలంకకు భయానకవాతావరణం సృష్టించారు. మ్యాచ్ ముగియడంతో శ్రీలంక ఇక్కట్లు తీరినందుకు తానైతే సంతోషించా" అని ఆయన కామెంట్ చేశారు.
 
చిత్తుగా ఓడిన శ్రీలంక 
ఐసీసీ ప్రపంచ కప్ పోటీలో భాగంగా గురువారం ముంబై వేదికగా జరిగిన మ్యాచ్‌లో భారత్ మరో విజయాన్ని సొంతం చేసుకుంది. శ్రీలంకను చిత్తు చేసిన భారత్.. 302 పరుగుల తేడాతో విజయభేరీ మోగించింది. ఫలితంగా 2023 ప్రపంచ కప్ పోట్లీలో సమీస్‌కు చేరిన తొలి జట్టుగా అడుగుపెట్టింది. ఇటీవల జరిగిన ఆసియా కప్ ఫైనల్ అందరికీ గుర్తుండే ఉంటుంది. టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ (6/21) బంతితో నిప్పులు చెరిగిన ఆ మ్యాచ్ లో శ్రీలంక 50 పరుగులకే కుప్పకూలింది. ఇప్పుడదే సీన్ రిపీటైంది. గురువారం టీమిండియా, శ్రీలంక జట్లు ముంబైలోని వాంఖెడే స్టేడియంలో తలపడ్డాయి. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 50 ఓవర్లలో 8 వికెట్లకు 357 పరుగులు చేసింది. 
 
ఐసీసీ వన్డే ప్రపంచ కప్ పోటీల్లో భాగంగా, గురువారం భారత్ తన ప్రత్యర్థి శ్రీలంక జట్టుతో తలపడింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 357 పరుగుల భారీ స్కోరు చేసింది. దీంతో శ్రీలంక ముగింట 358 పరుగుల భారీ విజయలక్ష్యాన్ని ఉంచింది. అయితే, ఈ మ్యాచ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ మినహా, మిగిలిన టాపార్డర్ బ్యాట్‌తో వీరవిహారం చేశారు. 
 
రోహిత్ శర్మ నాలుగు పరుగులకే ఔటైనప్పటికీ మరో ఓపెనర్ శుభమన్ గిల్ 92 బంతుల్లో 11 ఫోర్లు, రెండు సిక్స్‌ల సాయంతో 92, విరాట్ కోహ్లీ 94 బంతుల్లో 11 ఫోర్ల సాయంతో 88 పరుగులు చేసి అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడారు. వీరిద్దరూ రెండో వికెట్‌కు ఏకంగా 189 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. వీరిద్దరూ సెంచరీ దిశగా సాగుతున్న సమయంలో దిల్షాన్ మధుశంక వీరి జోడీని విడిదీశాడు. దీంతో కోహ్లీ మరోమారు సెంచరీ చేజార్చుకున్నాడు. 
 
ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన శ్రేయాస్ అయ్యర్ శ్రీలంక బౌలింగ్‌ను ఊచకోత కోశాడు. 56 బంతుల్లో ఆరు సిక్స్‌లు, మూడు ఫోర్ల సాయంతో 82 పరుగులు చేయగా, కేఎల్ రాహుల్ 19 బంతుల్లో రెండు ఫోర్లతో 21 పరుగులు, సూర్యకుమార్ యాదవ్ 9 బంతుల్లో రెండు ఫోర్ల సాయంతో 12 పరుగులు, రవీంద్ర జడేజా 34 పరుగులు చేశాడు. శ్రీలంక బౌలర్లలో మధుశంక 5, దుష్మంత చమీర ఒక వికెట్ చొప్పున తీశాడు. ప్రస్తుతం శ్రీలంక జట్టు గెలుపొందాలంటే 50 ఓవర్లలో 359 పరుగులు చేయాల్సివుంది. 
 
భారత్ భారీ స్కోరు సాధించిన అదే పిచ్‌పై శ్రీలంక టాపార్డర్ ఘోరంగా విఫలమైంది. షమీ, సిరాజ్‌లు మరోసారి చెలరేగి ఎనిమిది వికెట్లు కూల్చారు.  మహ్మద్ షమీ ఐదు వికెట్లు తీసి లంకేయుల వెన్ను విరిచాడు. సిరాజ్ మూడు వికెట్లు తీయగా, బుమ్రా, జడేజాలు ఒక్కో వికెట్ తీశారు. ఫలితంగా శ్రీలంక జట్టు కేవలం 19.4 ఓవర్లలో 55 పరుగులకే కుప్పకూలింది. దీంతో భారత్ 302 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 
 
ఇన్నింగ్స్ తొలి బంతికే లంక ఓపెనర్ పత్తుమ్ నిస్సాంక (0)ను డకౌట్ చేయడం ద్వారా బుమ్రా లంక వికెట్ల పతనానికి శ్రీకారం చుట్టాడు. ఆ తర్వాత సిరాజ్ మ్యాజిక్ మొదలైంది. మరో ఓపెనర్ కరుణరత్నే (0)ను ఖాతా తెరిచే చాన్స్ ఇవ్వకుండా పెవిలియన్ కు పంపిన సిరాజ్, అదే ఊపులో లంక కెప్టెన్ కుశాల్ మెండిస్ (1) ను కూడా అవుట్ చేశాడు. అతడ్ని సిరాజ్ బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత సదీర సమరవిక్రమకు సిరాజ్ ఎలాంటి చాన్స్ ఇవ్వలేదు. సమరవిక్రమను కూడా డకౌట్ చేశాడు. అప్పటికి లంక స్కోరు 3 పరుగులే. 
 
ఆ తర్వాత మహ్మద్ షమీ బంతిని అందుకోవడం లంక మరింత హడలిపోయింది. షమీ వరుసగా రెండు బంతుల్లో రెండు వికెట్లు తీసి లంకను కోలుకోలేని దెబ్బకొట్టాడు. అప్పటికి స్కోరు 9.4 ఓవర్లలో 14 పరుగులకు 6 వికెట్లు. షమీ ధాటికి చరిత్ అసలంక (1), దుషాన్ హేమంత (0) పేలవ రీతిలో వెనుదిరిగారు. కాసేపటికే దుష్మంత చమీర కూడా షమీ బంతికి బలయ్యాడు. 
 
వికెట్ల వెనుకాల కేఎల్ రాహుల్ అద్భుత క్యాచ్ అందుకోవడంతో షమీకి మూడో వికెట్ దక్కింది. చివరకు 19.4 ఓవర్లలో 55 పరుగులకే ఆలౌట్ అయింది. ఆ జట్టులో బౌలర్ రజిత చేసిన 14 పరుగులే అత్యధికం కావడం గమనార్హం. ఐదుగురు లంక బ్యాట్స్‌మెన్లు డకౌట్ అయ్యారు. టాపార్డర్ కుప్పకూలిపోవడంతో శ్రీలంక ఘోర పరాజయాన్ని చవిచూసింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఐసీసీ ప్రపంచ కప్ : చిత్తుగా ఓడిన శ్రీలంక.. సెమీస్‌కు భారత్