కంగనా రనౌత్ ఇటీవల విడుదలైన తేజస్ సినిమా కోసం వార్తల్లో నిలిచింది. యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ఇక తమిళంలోనూ, తెలుగులోనూ విడుదలైన చంద్రముఖి 2 చిత్రం కూడా డిజాస్టర్ గా నిలిచింది. కానీ ఆమె ఫాలోయింగ్ తగ్గలేదు. నిన్ననే ఆమె ముంబైలో షాపింగ్ చేయడంతో ఫొటో మీడియా వెంటపడింది. అందరికీ విషెస్ చెప్పి కారులో వెళ్ళిపోయింది.
అయితే, శుక్రవారం కంగనా తన Y+ కేటగిరీ భద్రతా సిబ్బందితో కలిసి ముంబై వీధుల్లో బాంద్రా లో షాపింగ్ చేసింది. అది వైరల్ అవుతోంది.
కంగనా రనౌత్ అనార్కలి సూట్, సల్వార్‌లో కనిపించింది. కంగనా దుకాణం వెలుపల షట్టర్‌బగ్‌లను కనుగొని, '5 సాల్ బాద్ మెయిన్ షాపింగ్ కర్నే ఆయీ. ఆప్ లోగోన్ నే ముజే పకడ్ లియా' అని ఫొటో గ్రాఫర్లతో అంటూ కారు ఎక్కి వెళ్ళిపోయింది.