Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాహుల్ యాత్ర ఎఫెక్ట్ : హైదారాబాద్‌లో స్కూల్స్‌కు సెలవు

Webdunia
బుధవారం, 2 నవంబరు 2022 (11:15 IST)
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ దేశ వ్యాప్త పాదయాత్రను కొనసాగిస్తున్నారు. భారత్ జోడో యాత్ర పేరుతో ఆయన ఈ పాదయాత్ర చేస్తున్నారు. ప్రస్తుతం ఇది తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతోంది. ఈ యాత్ర కారణంగా హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లోని పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. 
 
ముఖ్యంగా, సికింద్రాబాద్, కూకట్‌పల్లి, బానానగర్, బోయిన్‌పల్లి తదిత ప్రాంతాల్లోని విద్యా సంస్థలకు సెలవులు ఇచ్చారు. దీనికి కారణం లేకపోలేదు. రాహుల్ భారత్ జోడో యాత్ర కారణంగా హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ మార్పులు చేశారు. అనేక ప్రాంతాల్లో వాహనాలను దారి మళ్లించారు. ఈ కారణంగా విద్యార్థులకు ఇబ్బందులు కలగకూడదన్న ఉద్దేశ్యంతో స్కూల్స్‌కు సెలవులు ఇచ్చారు. 
 
ఇదిలావుంటే, ఈ యాత్ర బుధవారం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. అంతేకాకుండా సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కూడా నగర వాసులకు ఓ విన్నపం చేశారు. బోయిన్‌పల్లి, బాలా నగర్, వై జంక్షన్, జేఎన్టీయూ, చాంద్ నగర్‌ ప్రాంతాలకు వెళ్లకుండా వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని కోరారు. 

సంబంధిత వార్తలు

సహచర నటి పవిత్ర ఎడబాటును భరించలేక నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య!!

దేవర ఫియర్ సాంగ్ వర్సెస్ పుష్ప సాంగ్.. జరగండి అంటోన్న చెర్రీ

కనీసం నా పిల్లలతో చాక్లెట్ పార్టీకి కూడా తీరికలేదు, రేవ్ పార్టీనా?: జానీ మాస్టర్ - video

రేవ్ పార్టీలో పట్టుబడ్డ అతడెవరో నాలాగే వున్నాడు: శ్రీకాంత్ మేకా

అబ్బాయిలూ ఇలా అమ్మాయిలకు ప్రపోజ్ చేస్తే చెంపలు చెళ్లుమంటాయి

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments