హైదరాబాద్ నగర శివారు ప్రాంతంలో ఒక అమానుష ఘటన జరిగింది. ఉపాధి నిమిత్తం హైదరాబాద్ నగరానికి వచ్చిన 16 యేళ్ల బాలుడి మర్మాంగంపై టపాసులు పేల్చిన వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది.
ఈ వివరాలను పరిశీలిస్తే, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఖుషీనగర్‌కు చెందిన 16 యేళ్ల బాలుడిని మూడు నెలల క్రితం నగరానికి ఉపాధి నిమిత్తం బంధువులు పంపించారు. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధి బాసిరేగడి శివారులో జేఎస్‌డబ్ల్యూ రెడీమిక్స్ ప్లాంట్‌లో ఆ బాలుడు పని చేస్తున్నాడు.
కాగా, కొన్ని రోజులుగా ఆ బాలుడిని ఇబ్బందులకు గురిచేస్తున్న తోటి యువకులు దీపావళి పండుగ రోజున బాలుడి మర్మాంగంపై టపాసులు పెట్టిన పేల్చారు. పైగా, ఈ తతంగాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో వైరల్ అయింది. ఈ వీడియో బాధిత బాలుడి బంధువులు తిలకించడంతో ఈ విషయం కుటుంబీకులకు చేరింది.
ఆ తర్వాత ఆ బాలుడికి ఫోన్ చేసి ఆరా తీయడంతో అది నిజమని తేలడంతో బాలుడు తల్లిదండ్రులు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఖుషీ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. ఆ కేసును మంగళవారం మేడ్చల్ పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు. దీంతో మేడ్చల్ పోలీసులు కేసు దర్యాప్తు జరుపుతున్నారు.