Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలుడి మర్మాంగంపై టపాసులు పేల్చారు.. ఎక్కడ?

Webdunia
బుధవారం, 2 నవంబరు 2022 (10:53 IST)
హైదరాబాద్ నగర శివారు ప్రాంతంలో ఒక అమానుష ఘటన జరిగింది. ఉపాధి నిమిత్తం హైదరాబాద్ నగరానికి వచ్చిన 16 యేళ్ల బాలుడి మర్మాంగంపై టపాసులు పేల్చిన వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఖుషీనగర్‌కు చెందిన 16 యేళ్ల బాలుడిని మూడు నెలల క్రితం నగరానికి ఉపాధి నిమిత్తం బంధువులు పంపించారు. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధి బాసిరేగడి శివారులో జేఎస్‌డబ్ల్యూ రెడీమిక్స్ ప్లాంట్‌లో ఆ బాలుడు పని చేస్తున్నాడు. 
 
కాగా, కొన్ని రోజులుగా ఆ బాలుడిని ఇబ్బందులకు గురిచేస్తున్న తోటి యువకులు దీపావళి పండుగ రోజున బాలుడి మర్మాంగంపై టపాసులు పెట్టిన పేల్చారు. పైగా, ఈ తతంగాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో వైరల్‌ అయింది. ఈ వీడియో బాధిత బాలుడి బంధువులు తిలకించడంతో ఈ విషయం కుటుంబీకులకు చేరింది. 
 
ఆ తర్వాత ఆ బాలుడికి ఫోన్ చేసి ఆరా తీయడంతో అది నిజమని తేలడంతో  బాలుడు తల్లిదండ్రులు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఖుషీ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. ఆ కేసును మంగళవారం మేడ్చల్ పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు. దీంతో మేడ్చల్ పోలీసులు కేసు దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కళాప్రపూర్ణ కాంతరావు 101వ జయంతి వేడుకలు

ఎక్కడికీ పారిపోలేదు.. ఇంట్లోనే ఉన్నా.. పోలీసులకు బాగా సహకరించా : నటి కస్తూరి

యాక్షన్ కింగ్ అర్జున్ సర్జాకు గౌరవ డాక్టరేట్ తో సత్కారం

మహారాష్ట్రలో సాంగ్ షూట్ లో సిద్దు జొన్నలగడ్డ తెలుసు కదా!

సారంగపాణి జాతకం చేతి రేఖల్లో వుందా? చేతల్లో ఉందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళల్లో జ్ఞాపకశక్తి పెరగాలంటే.. రోజూ ఓ కోడిగుడ్డు తినాల్సిందేనట

క్యాల్షియం స్థాయిలను వృద్ధి చేసే 6 సహజసిద్ధ పానీయాలు, ఏంటవి?

బెల్లంతో చేసిన నువ్వుండలు తింటే ప్రయోజనాలు

తిరుపతిలో తమ మొదటి స్టోర్‌ను ప్రారంభించిన ప్రముఖ లగ్జరీ ఫర్నిచర్ బ్రాండ్ డురియన్

యూరిక్ యాసిడ్ తగ్గించే పండ్లు ఏంటి?

తర్వాతి కథనం
Show comments