Webdunia - Bharat's app for daily news and videos

Install App

నెహ్రూ జూ పార్కులో చీతాకు గుండెపోటు - మృతి

Webdunia
ఆదివారం, 26 మార్చి 2023 (09:34 IST)
హైదరాబాద్ నగరంలోని నెహ్రూ జూపార్కులో ఉండే చీతాకు గుండెపోటు వచ్చింది. దీంతో అది కన్నుమూసింది. గత 11 సంవత్సరాలుగా సందర్శకులను ఎంతగానో ఆకట్టుకుంటూ వచ్చిన మగ చీతా అబ్దుల్లా(15) మృత్యువాతపడటంతో అధికారులు పోస్టుమార్టం నిర్వహించి, గుండెపోటుకు గురైనట్లు నిర్ధారించారు. 
 
ప్రస్తుతం దక్షిణ భారతంలో మైసూర్‌తోపాటు నెహ్రూ జూలోనే చీతాలు ఉన్నాయి. 2011లో సౌదీ రాజ కుటుంబీకులు జూను సందర్శించి, జూ నిర్వహణకు ముగ్ధులై 2012లో ఒక జత ఆడ, మగ చీతాలను జూకు పంపించారు. అప్పుడు వీటి వయసు నాలుగేళ్లు. ఆడ చీతా పన్నెండేళ్ల ప్రాయంలో (2020లో) అనారోగ్యంతో మృతి చెందింది. అప్పటి నుంచి జూలో అబ్దుల్లా ఒంటరిగా ఉంటోంది. అబ్దుల్లా మరణంతో ప్రస్తుతం జూలో చీతాలు లేకుండా పోయాయి.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments