Webdunia - Bharat's app for daily news and videos

Install App

పడక గదిలో డిజిటల్ వీడియో రికార్డర్.. భార్య - ప్రియుడి రాసలీలల గుట్టురట్టు

Webdunia
ఆదివారం, 24 నవంబరు 2019 (10:00 IST)
బెంగుళూరులో ఓ భర్త.. తన భార్య మరో వ్యక్తితో గుట్టుచప్పుడు కాకుండా సాగిస్తూ వచ్చిన వివాహేతర సంబంధాన్ని బహిర్గతం చేశాడు. తమ పడక గదిలోనే డిజిటల్ వీడియో రికార్డర్‌ను అమర్చి.. భార్యకు చెప్పి బెంగుళూరుకు వెళ్లిపోయాడు. ఇదే అదునుగా భావించిన భార్య.. తన ప్రియుడిని ఇంటికి పిలిపించి ఆ రెండు రోజుల పాటు ఎంజాయ్ చేసింది. పడక గదలో వారిద్దరూ సన్నిహితంగా ఉన్న దృశ్యాలన్నీ ఆ వీడియోలో రికార్డ్ అయ్యాయి. వీటిని ఆధారంగా చేసుకుని కోర్టు వారికి విడాకులు మంజూరు చేసింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, కర్నాటకలోని బళ్లారికి చెందిన జంటకు 1991లో పెళ్లయింది. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే, భార్య ప్రవర్తనలో మార్పు రావడాన్ని భర్త గమనించాడు. భార్యను అనుమానించి ప్రశ్నిస్తే గగ్గోలు పెడుతుందని ఊహించాడు. 
 
అందుకే రెండ్రోజుల పాటు బెంగళూరుకు వెళుతున్నాని చెప్పి పడకగదిలో డిజిటల్‌ వీడియో రికార్డర్‌ను పెట్టి వెళ్లాడు. ఆ రెండ్రోజులపాటు ఆమె ఇంటికి తన ప్రియుడిని పిలిపించుకొని పడకగదిలో అతడితో సన్నిహితంగా గడిపింది. ఈ సంఘటన 2008లో జరిగింది. 
 
అదంతా వీడియోలో రికార్డుకావడంతో దాన్ని ఆధారంగా చేసుకొని భర్త.. విడాకులు కోరుతూ బళ్లారి ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించాడు. వీడియో సాక్ష్యంగా చేసుకొని కోర్టు విడాకులు మంజూరు చేసింది. అయితే భార్యేమో ఈ తీర్పును వ్యతిరేకిస్తూ 2013లో హైకోర్టుకు వెళ్లింది. 
 
తన భర్త పోర్న్‌ వీడియోలు తీస్తాడని, తనతో బలవంతంగా ఆ పనిచేయించాడని కోర్టుకు తెలిపింది. ఆ వీడియో చూసిన న్యాయమూర్తులు.. భార్య మాటలు నమ్మేలా లేవంటూ బళ్లారి ఫ్యామిలీ కోర్టు తీర్పును సమర్థించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Thug Life: మణిరత్నం, కమల్ హాసన్ థగ్ లైఫ్ తాజా అప్ డేట్

Ambedkar: అగ్రహారంలో అంబేద్కర్ సినిమా ఫస్ట్ లుక్

బుట్టబొమ్మకు తెలుగులో తగ్గిన అవకాశాలు.. బాలీవుడ్‌లో ఛాన్సులు...

పుష్పక విమానం టాకీ అయితే అది సారంగపాణి జాతకం : వెన్నెల కిషోర్

8కె. ఫార్మెట్ లో ఎన్.టి.ఆర్., రాజమౌళి సినిమా యమదొంగ రిరిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

తర్వాతి కథనం