ఎన్నారై భార్యతో డాక్టర్ అక్రమ సంబంధం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న వైనం...

శనివారం, 23 నవంబరు 2019 (13:09 IST)
హైదరాబాద్ నగరంలో ఓ వివాహేతర సంబంధాన్ని స్థానికులే బహిర్గతం చేసి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఆ తర్వాత వారిని స్థానిక పోలీసులకు అప్పగించారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, హైదరాబాద్ నగరంలోని బోడుప్పల్ ఆర్.బి.ఎం ఆస్పత్రిలో శివప్రసాద్ అనే వ్యక్తి వైద్యుడుగా పని చేస్తున్నారు. 
 
ఈయన తన వద్దకు వచ్చే పలువురు మహిళలను తన మాటల గారడితో బురిడీకొట్టించి.. లోబరుచుకుంటారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో ఎన్నారై సంతోష్ రెడ్డి అనే వ్యక్తి భార్య సమత. ఈమెతో శివప్రసాద్‌కు పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. 
 
ఈ నేపథ్యంలో వాసవి కాలనీలో ఓ ఇంట్లో శివప్రసాద్‌.. సమతతో కలిసి ఉండగా సంతోష్‌ రెడ్డి రెడ్‌హ్యాండెడ్‌ పట్టుకున్నాడు. ఇద్దరిని పట్టుకుని పోలీసులకు అప్పగించాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 
 
మరోవైపు చైతన్యపురి పోలీస్‌స్టేషన్ ఎదుట డాక్టర్ శివప్రసాద్ అనుచరులు హల్‌చల్ చేశారు. మీడియాపై దురుసుగా ప్రవర్తించారు. డాక్టర్ ముసుగులో శివప్రసాద్ అనేక మంది మహిళలతో అక్రమ సంబంధాలు పెట్టుకున్నాడని సంతోష్‌రెడ్డి ఆరోపించారు. 

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం అకౌంట్లు, సిమ్‌లకు ఆధార్ అవసరమా..?