Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ప్రేమ పిచ్చోడిగా మారి.. పొరుగు దేశానికి బందీగా....

ప్రేమ పిచ్చోడిగా మారి.. పొరుగు దేశానికి బందీగా....
, బుధవారం, 20 నవంబరు 2019 (10:45 IST)
ప్రేమ పిచ్చోడిగా మారిపిన ఓ టెక్కీ.. ఇపుడు శత్రుదేశం చేతిలో బందీగా ఉన్నాడు. తన బిడ్డ ప్రాణాలు కాపాడాలంటూ అతని తండ్రి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నాడు. హైదరాబాద్‌కు చెందిన టెక్కీ ప్రశాంత్ రాజస్థాన్ రాష్ట్రం సరిహద్దుల మీదుగా పాకిస్థాన్ గడ్డపై అడుగుపెట్టాడు. దీంతో ఆ దేశ అధికారులు అతన్ని అదుపులోకి తీసుకున్నాయి. 
 
అయితే, మహేష్ అలా చిక్కడానికి ప్రధాన కారణం ప్రేమ విఫలం కావడమేనని తల్లిదండ్రులు అంటున్నారు. ప్రేయసి కోసం స్విట్జర్లాండ్‌కు పయనమైన ప్రేమికుడు.. తన ప్రేమను దక్కించుకోకపోగా పాకిస్థాన్‌ పోలీసుల చేతిలో బందీగా చిక్కాడని వాపోతున్నారు. రెండేళ్లుగా బిడ్డడు ఎక్కడున్నాడో తెలియక తల్లిదండ్రుల ఆందోళన.. క్లూ దొర్కపోవడంతో మిస్సింగ్‌ కేసు ఒక్క అంగుళం కూడా ముందుకు కదలక పోలీసుల హైరానా.
 
చివరకు పాకిస్థాన్‌ మీడియా ఓ వీడియోను విడుదల చేయడం.. గూఢచర్యం అభియోగంతో అరెస్టయ్యాడంటూ కథనాలు ప్రసారం చేయడంతో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీరు వి.ప్రశాంత్‌ కేసు మిస్టరీ కొంత వరకు వీడినట్లయింది. రాజస్థాన్‌ ఎడారి ప్రాంతమైన కొలిస్థాన్‌ నుంచి పాకిస్థాన్‌లోకి అక్రమంగా ప్రవేశించి.. అక్కడి పోలీసులకు చిక్కిన ప్రశాంత్‌ గురించి తల్లిదండ్రులను ఆరా తీయగా ఆసక్తి విషయాలు వెలుగులోకి వచ్చాయి.
 
ప్రశాంత్‌ 2016లో మాదాపూర్‌లోని షోర్‌ ఇన్ఫోటెక్‌లో చేరారు. 2017 ఏప్రిల్‌ 11న ఉద్యోగానికి వెళ్లి, ఇంటికి తిరిగి రాలేదు. దీంతో.. ప్రశాంత్‌ తండ్రి బాబూరావు అదే నెల 29న మాదాపూర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అన్ని కోణాల్లో కేసు దర్యాప్తు చేసిన పోలీసులు.. క్లూ దొరక్కపోవడం.. గతంలోనూ ప్రశాంత్‌ ఇంట్లోంచి పారిపోయాడని తల్లిదండ్రులు చెప్పడంతో కేసును మూసివేశారు.
 
అయితే, తాను ప్రేమించిన స్వప్నికాపాండే స్విట్జర్లాండ్‌లో ఉన్నట్లు తెలుసుకున్న ప్రశాంత్‌ ఆ దేశానికి వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇంట్లోవాళ్లకు చెప్పాపెట్టకుండా వెళ్లిపోయాడు. స్వప్నికాపాండే స్వస్థలం మధ్యప్రదేశ్‌. ఆమెను వెతికే క్రమంలోనే అతడికి దరీలాల్‌ పరిచయం అయ్యి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. 
 
ప్రశాంత్‌ ఆమెను వెతికేందుకు దరీలాల్‌ సహాయం తీసుకుని ఉంటాడని.. ఆ క్రమంలో రాజస్థాన్‌ థార్‌ ఎడారిలో తప్పిపోయి.. పాకిస్థాన్‌ సరిహద్దులు దాటి ఉంటారని భావిస్తున్నారు. అయితే.. ప్రశాంత్‌ స్విట్జర్లాండ్‌కు కాకుండా రాజస్థాన్‌ ఎందుకు వెళ్లాడనే కోణంపై పోలీసులు దృష్టిసారించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మద్యం బాటిల్ ముట్టుకుంటే షాక్ కొట్టాలి.. ఏం చేస్తారో మీయిష్టం : మంత్రులతో సీఎం జగన్