Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అకౌంట్లు, సిమ్‌లకు ఆధార్ అవసరమా..?

Advertiesment
అకౌంట్లు, సిమ్‌లకు ఆధార్ అవసరమా..?
, శనివారం, 23 నవంబరు 2019 (12:55 IST)
న్యూఢిల్లీ: ప్రైవేటు సంస్థలు ఆధార్​ డేటాను వాడుకునేందుకు అనుమతిస్తూ కేంద్ర సర్కార్​ ‘ఆధార్​ చట్టం’లో చేసిన మార్పులు రాజ్యాంగవిరుద్ధమంటూ దాఖలైన పిటిషన్​ను సుప్రీంకోర్టు శుక్రవారం విచారించింది.

ప్రస్తుతం దేశంలోని దాదాపు అన్ని బ్యాంకులు, టెలికాం సంస్థలు ఆధార్​ డేటాను తీసుకున్న తర్వాతే సేవలందిస్తున్నాయి. కస్టమర్లకు ఇష్టమైతే స్వచ్ఛందంగా డేటా ఇవ్వొచ్చంటూ కేంద్రం జులైలో ఆధార్ చట్టానికి సవరణ చేయడంతో  ప్రైవేటు సంస్థలు ఆధార్​ డేటాను వాడుకుంటున్నాయి.
 
అయితే, జులైలో కేంద్రం చేసిన సవరణ.. 2019 మార్చి నాటి సుప్రీంకోర్టు రాజ్యాంగ బెంచ్​ తీర్పును నీరుగార్చేలా ఉందని, ప్రైవేటుకు ఆధార్​ అనుమతి రాజ్యాంగవిరుద్ధమంటూ ఎస్​జీ వొంబాట్కేర్​ అనే రిటైర్డ్​ ఆర్మీ అధికారి సుప్రీంకోర్టులో పిటిషన్​ వేశారు. దీన్ని సీజేఐ జస్టిస్​ ఎస్​ఏ బోబ్​డే, జస్టిస్​ బీఆర్ గవై బెంచ్​ పరిశీలించింది. ఈ అంశంపై వివరణ ఇవ్వాల్సిందిగా బెంచ్​  కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. 
 
ఆధార్​ చట్టం ప్రమాణికతను సమర్థిస్తూ మార్చిలో తీర్పు చెప్పిన సుప్రీం బెంచ్​.. ఈ చట్టానికి ఎలాంటి మినహాయింపులు ఉండవని, స్వచ్ఛందంగానైనాసరే కస్టమర్ల నుంచి ప్రైవేటు కంపెనీలు ఆధార్​ డేటా సేకరించడానికి వీల్లేదని స్పష్టం చేసింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పడకగదిలో రహస్యంగా డీవీఆర్.. ఫ్రెండ్‌తో శృంగారం.. భర్తకు విడాకులు