Webdunia - Bharat's app for daily news and videos

Install App

అర్థరాత్రి తలుపు తట్టిన ఎన్నారై భర్త... ఇంట్లో దృశ్యం చూసి అవాక్కయ్యాడు...

Webdunia
ఆదివారం, 24 నవంబరు 2019 (09:50 IST)
పొట్టకూటి కోసం ఆ భర్త విదేశాలకు వెళ్లాడు. ఇదే అదునుగా భావించిన భార్య మాత్రం భర్త ఎడబాటును పోగొట్టుకునేందుకు మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం తెలుసుకున్న భర్త కుమిలిపోయాడు. తనకు ద్రోహం చేస్తున్న భార్యను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకునేందుకు విదేశాల నుంచి స్వదేశానికి వచ్చి నిఘా పెట్టాడు. ఈ క్రమంలో అర్థరాత్రి ఇంటికెళ్లి తలుపుతట్టాడు. తలుపు తీయగానే ఇంట్లో కనిపించిన దృశ్యం చూసి నిర్ఘాంతపోయాడు. ఈ ఘటన హైదరాబాద్ నగరంలో జరిగింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, సూర్యాపేట జిల్లా నడిగూడేనికి చెందిన వ్యక్తికి అదే జిల్లాకు చెందిన యువతితో పదేళ్ల క్రితం వివాహమైంది. ఆ తర్వాత కొన్ని రోజులకే హైదరాబాద్ వచ్చి కొత్తపేటలోని వాసవీకాలనీలో సొంత ఫ్లాట్ కొనుక్కుని కాపురం పెట్టారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇంజినీరింగ్ పూర్తిచేసిన భర్త ఎంఎస్ చదివేందుకు ఆరేళ్ల క్రితం ఆస్ట్రేలియాకు వెళ్లాడు. అప్పుడప్పుడు హైదరాబాద్ వచ్చి వెళ్లేవాడు.
 
ఈ క్రమంలో భర్త దూరంగా ఉండడంతో భార్య తన చిన్ననాటి స్నేహితుడైన వైద్యుడు శివప్రసాద్‌తో పరిచయం పెంచుకుంది. ఈ పరిచయం కాస్త అక్రమ సంబంధానికి దారితీసింది. ఈ విషయం తెలిసిన భర్త.. భార్యకు ఫోన్ చేసి హెచ్చరించాడు. అయినప్పటికీ ఆమె ప్రవర్తనలో ఎటువంటి మార్పు రాలేదు. దీంతో భార్యను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకునేందుకు భార్యకు తెలియకుండా 20 రోజుల క్రితం రహస్యంగా హైదరాబాద్ చేరుకుని ఆమెపై నిఘాపెట్టాడు. ఆమె తప్పించుకోకుండా దొరకాలని సమయం కోసం ఎదురుచూశాడు. ఈ క్రమంలో శుక్రవారం అర్థరాత్రి భార్య, తన స్నేహితుడితో కలిసి ఉండగా వెళ్లి తలుపుకొట్టాడు.
 
తలుపు తెరిచిన భార్య నివ్వెరపోయింది. లోపలున్న శివప్రసాద్‌ను చూసి ఇక్కడ ఎందుకున్నావని భర్త ప్రశ్నించాడు. దీనికి అతడు స్పందిస్తూ.. తాను ఎప్పుడైనా వస్తానని, ఎక్కువ మాట్లాడితే చంపేస్తానని బెదిరించాడు. వారిద్దరి మధ్య వాగ్వివాదం జరిగింది. బాధిత భర్త అప్పటికే పోలీసులకు సమాచారం అందించడంతో వారు అదే సమయానికి అక్కడికి చేరుకుని శివప్రసాద్‌ను, బాధితుడి భార్యను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు వారితో మాట్లాడుతుండగానే అక్కడ మరో షాకింగ్ ఘటన జరిగింది. 
 
ఆ ఇంట్లోని మరో గదిలో నిందితురాలి స్నేహితులైన నరేశ్, మరో యువతి పట్టుబడ్డారు. వీరు దంపతులు కాదని, వీరు కూడా వివాహేతర సంబంధం నెరుపుతున్నారని నిర్ధారించుకుని అందరినీ అరెస్ట్ చేశారు. వీరందరిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పూజా హెగ్డేలో ప్రేమలో పడింది.. ఘాటుగా లిప్ కిస్.. ట్రెండింగ్‌లో బుట్టబొమ్మ (video)

సెల్ఫీ కోసం వచ్చిన మహిళా ఫ్యాన్స్‌కు ముద్దు పెట్టిన ఉదిత్.. ఏకంగా లిప్ లాక్ (video)

పుష్ప 2కు ముందే వైల్డ్ ఫైర్ షో చేశాం - సినిమాలూ చేస్తున్నా : ఫరియా అబ్దుల్లా

తనికెళ్ల భరణి ప్రధాన పాత్రలో క్రైమ్ థ్రిల్లర్ అసుర సంహారం

ఆ హీరోతో రశ్మిక మందన్నా డేటింగ్ లో వున్నమాట నిజమేన !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆడోళ్లకు కూడా కండోమ్స్ వచ్చేశాయి.. ఎలా వాడాలో తెలుసా?

మండుతున్న అగ్నిగోళం నుంచి చందమామ చల్లగా ఎలా మారాడు? 4.5 బిలియన్ ఏళ్ల క్రితం (video)

ఆటలో అరటి పండు కాదు ఆరోగ్యానికి అరటి పండు

ఆత్రేయపురం పూతరేకులను తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసా?

ఇబ్బంది పెట్టే మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

తర్వాతి కథనం
Show comments