Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్మార్ట్‌ఫోన్లోనే సంసారం.. భర్తను పట్టించుకోలేదు.. కత్తిపీటతో చెవిని కోసేశాడు...

స్మార్ట్‌ఫోన్ల పుణ్యంతో మానవీయ విలువలు మంటగలిసిపోతున్నాయనేందుకు అనేక సంఘటనలు చోటుచేసుకుంటూనే వున్నాయి. స్మార్ట్‌ఫోన్లకున్న మర్యాద మనుషులకు లేకపోయింది. సెల్ ఫోన్ లేకుండా చాలామంది నిద్రపోవట్లేదు. దీంతో

Webdunia
శనివారం, 18 ఆగస్టు 2018 (12:49 IST)
స్మార్ట్‌ఫోన్ల పుణ్యంతో మానవీయ విలువలు మంటగలిసిపోతున్నాయనేందుకు అనేక సంఘటనలు చోటుచేసుకుంటూనే వున్నాయి. స్మార్ట్‌ఫోన్లకున్న మర్యాద మనుషులకు లేకపోయింది. సెల్ ఫోన్ లేకుండా చాలామంది నిద్రపోవట్లేదు. దీంతో మానవ సంబంధాలు అంతంత మాత్రంగానే వున్నాయి. స్మార్ట్‌ఫోన్లను పట్టించుకునేవారు అధికమయ్యారు. 
 
భార్యను భర్త పట్టించుకోవట్లేదు. భర్తను భార్య కూడా పట్టించుకోవట్లేదు. తాజాగా ఓ భార్య భర్తను పట్టించుకోకుండా సెల్ ఫోన్లో మాట్లాడుతూ వుండిపోయింది. దీన్ని సహించుకోలేకపోయిన భర్త ఆమె చెవిని కోసిపారేశాడు. ఈ ఘటన తమిళనాడు, సేలం జిల్లాలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. సేలంలో ముత్తురాజా(40), ఆయన భార్య సంధ్య(40) ఎడప్పాటి పెరుమాళ్గుడి ప్రాంతంలో ఉంటున్నారు. ముత్తురాజా ఓ ఫ్యాక్టరీలో పనిచేస్తుండగా, సంధ్య ప్రైవేటు స్కూల్‌లో అసిస్టెంట్ హెడ్మాస్టర్‌గా పనిచేస్తోంది. ఈ నేపథ్యంలో సంధ్య ఎక్కువ సమయం ఫోన్లో మాట్లాడుతూ గడిపేది. భర్తను పట్టించుకునేది కాదు. దీంతో పద్ధతి మార్చుకోవాలని ఆమెను పలుమార్లు ముత్తురాజా హెచ్చరించాడు. 
 
అయినా ఆమె సీరియస్‌గా తీసుకోలేదు. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి పనినుంచి ఇంటికొచ్చిన ముత్తురాజాను భార్య సంధ్య పట్టించుకోకుండా ఫోనులో మాట్లాడుతూ గడిపింది. తాను వచ్చినా పట్టించుకోకపోవడం, ఫోన్‌లో ఎవరితోనో నవ్వుతూ మాట్లాడటాన్ని గమనించిన ముత్తురాజా.. కత్తిపీటతో సంధ్య కుడిచెవిని కోసి పారేశాడు. 
 
దీంతో బాధితురాలు గట్టిగా అరవడంతో చుట్టుపక్కల ఉన్నవారు అక్కడికి చేరుకుని ఆమెను ఆస్పత్రికి తరలించారు. భార్య ఇచ్చిన ఫిర్యాదుతో ముత్తురాజాను పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

క్షమించమని అడక్కుండా రాజకీయాలకు స్వస్తి చెప్తే సరిపోదు: పోసానిపై నిర్మాత

అతివృష్టి లేదంటే అనావృష్టి : ఈ శుక్రవారం ఏకంగా 10 చిత్రాలు విడుదల...

పుష్ప-2 ది రూల్‌ నుంచి శ్రీలీల కిస్సిక్‌ సాంగ్‌ రాబోతుంది

డిఫరెంట్ యాక్షన్ థ్రిల్లర్ కిల్లర్ నుంచి పూర్వాజ్ క్యారెక్టర్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

రోజూ కొన్ని బాదంపప్పులు తీసుకోండి: నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యానికి తోడ్పడుతుంది

రక్తవృద్ధికి తోడ్పడే ఖర్జూరాలు

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండటానికి 8 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments