Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుత్తి బామ్మ వద్దకు వెళ్తే..రెండు రూపాయలకే ఇడ్లీ.. తెలుసా? (video)

Webdunia
శుక్రవారం, 4 నవంబరు 2022 (09:49 IST)
తమిళనాడులో ఓ బామ్మ తక్కువ ధరకే ఇడ్లీలు అమ్మిన సంగతి తెలిసిందే. ఈ వార్త నెట్టింట వైరల్ అయ్యింది. తాజాగా గుత్తికి చెందిన ఓ వృద్ధురాలు తక్కువ ధరకే ఇడ్లీలు, దోశలు అమ్ముతూ పేదల ఆకలి తీర్చుతోంది. తానే పేదరికంలో మగ్గుతున్నా.. సొంత లాభం కొంత వదులుకుంటూ జీవన యాత్రను కొనసాగిస్తోంది. 
 
స్థానిక బండగేరికి చెందిన వెంకటలక్ష్మి 28 ఏళ్ల నుంచి దోసెలు, ఇడ్లీలు అమ్ముతోంది. రూ.10కి మూడు దోశలు, అదే రూ.10కి ఐదు ఇడ్లీలు ఇస్తోంది. ఏడు పదుల వయసులోనూ ఆమె చిన్నకొట్టుతో జీవనం సాగిస్తోంది. 
 
రోజురోజుకు నిత్యావసరాల ధరలు పెరుతున్నా ఆమె మాత్రం తక్కువ దరకే ఇడ్లీలు, దోశలను విక్రయిస్తోంది. అతితక్కువ ధరకే ఇడ్లీలు, దోశలను అమ్ముతుండటంతో రోజూ తెల్లవారగానే అవ్వ వద్దకు అల్పాహారం కోసం వెళుతుంటారు. తక్కువ ఖర్చుతోనే ఆకలి తీర్చుకుంటున్నారు. 
 
రూ.10కే టిఫిన్‌ పెడుతున్న వెంకటలక్ష్మి అవ్వను ఎప్పటికీ మరువలేమని పిల్లలు, పెద్దలు అంటున్నారు. ఆమె పేదరికంలో వుందని ఆమెను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.   

 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments