Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శ్రీ సింహా కొత్త చిత్రం భాగ్ సాలే ఫస్ట్ లుక్

Advertiesment
Bhag Sale First Look
, శుక్రవారం, 7 అక్టోబరు 2022 (17:33 IST)
Bhag Sale First Look
నేటి తరం ప్రేక్షకులని అలరించే సరికొత్త కథతో హీరో శ్రీ సింహా కొత్త చిత్రం 'భాగ్ సాలే' ఫస్ట్ లుక్ నేడు విడుదలయింది. ప్రణీత్ సాయి దర్శకత్వంలో క్రైమ్ కామెడీ గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్, బిగ్ బెన్, సినీ వ్యాలీ మూవీస్ సినిమా బ్యానర్లపై అర్జున్ దాస్యన్, యష్ రంగినేని, కళ్యాణ్ సింగనమల నిర్మిస్తున్నారు.
 
ఈ సందర్భంగా నిర్మాత అర్జున్ దాస్యన్ మాట్లాడుతూ "ఈతరం ప్రేక్షకులని అలరించే కథతో థ్రిల్లింగ్ క్రైమ్ కామెడీ గా తెరకెక్కుతున్న మా చిత్రం 'భాగ్ సాలే' ఫస్ట్ లుక్ నేడు విడుదలయింది. ప్రణీత్ సాయి దర్శకత్వంలో హీరో శ్రీ సింహా, అర్జున్ పాత్రలో నటిస్తుండగా నేహా సొలంకి హీరోయిన్ గా నటిస్తుంది. జాన్ విజయ్, నందిని రాయ్ ప్రతినాయక పాత్రలు చేస్తున్నారు.
 
ఏం చేసైనా అనుకున్నది సాధించాలనుకునే ఒక యువకుడి పాత్ర చుట్టూ తిరిగే ఈ కథ ఆద్యంతం థ్రిల్ చేస్తుంది. ఇందులో రాజీవ్ కనకాల, వైవా హర్ష, సత్య, సుదర్శన్, వర్షిణి తదితరులు నటిస్తుండగా చిత్ర విజయం పై మాకు పూర్తి నమ్మకముంది." అన్నారు.
 
సంగీతం కాల భైరవ అందిస్తుండగా, ఎడిటింగ్ కార్తీక ఆర్ శ్రీనివాస్, సినిమాటోగ్రఫీ రమేష్ కుషేందర్ చేస్తున్నారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణంతర కార్యక్రమాలు జరుపుకుంటూ విడుదలకి సిద్ధంగా ఉంది.
 
నటీనటులు: శ్రీ సింహ కోడూరి, నేహా సొలంకి, రాజీవ్ కనకాల, జాన్ విజయ్, వర్షిణి సౌందరాజన్, నందిని రాయ్, వైవా హర్ష, సత్య, సుదర్శన్, ప్రిథ్వీ రాజ్, ఆర్ జె హేమంత్, బిందు చంద్రమౌళి , ర్మాతలు: అర్జున్ దాస్యన్, యష్ రంగినేని, కళ్యాణ్ సింగనమల

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప‌దేళ్ళ బాలిక సినిమా తార అయిన క‌థ‌తో చిత్రం