Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఉద్యోగులు ఇపుడే ఆఫీసుకు రావడాన్ని తప్పనిసరి చేయం : ఇన్ఫోసిస్

Advertiesment
infosys
, శుక్రవారం, 14 అక్టోబరు 2022 (16:56 IST)
కరోనా వైరస్ మహమ్మారి తర్వాత దేశంలోని అనేక ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోం అవకాశాన్ని కల్పించాయి. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా పరిస్థితులు చక్కబడినప్పటికీ అనేక కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోం విధానాన్నే కొనసాగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ టెక్ దిగజం ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం తీసుకుంది. తమ కంపెనీకి చెందిన ఉద్యోగులను ఇపుడిపుడే ఆఫీసుకు రావడాన్ని తప్పనిసరి చేయబోమని ఆ కంపెనీ సీఈఓ సలీల్‌ పరేఖ్‌ స్పష్టం చేశారు. 
 
ప్రస్తుతం తాము అవలంభిస్తున్న హైబ్రిడ్‌ పని విధానం (కొన్ని రోజులు ఇంటి నుంచి.. మరికొన్ని రోజులు ఆఫీసు నుంచి) వల్ల ఎలాంటి ఇబ్బంది రావడం లేదన్నారు. ఈ నేపథ్యంలో దీన్ని మరికొంత కాలం కొనసాగించనున్నట్లు పేర్కొన్నారు. ఖచ్చితంగా ఇన్ని రోజులు ఆఫీసుకు రావాలని కూడా నియమం పెట్టబోమన్నారు.
 
ఇంటి నుంచి పని విధానంపై ఇప్పటి వరకు కంపెనీ తీసుకున్న నిర్ణయాలపై ఉద్యోగుల స్పందన బాగుందన్నారు. ప్రస్తుతం భారత్‌లోని తమ ఆఫీసుల్లో ఏ సమయంలోనైనా 45 వేలకు తగ్గకుండా ఉద్యోగులు పనిచేస్తున్నారన్నారు. కొన్ని నెలల క్రితంతో పోలిస్తే ఈ సంఖ్య చాలా ఎక్కువన్నారు. పైగా ఇది క్రమంగా పెరుగుతోందన్నారు. అలాగే ఉద్యోగులు ఆఫీసుకు వచ్చేందుకు అన్ని రకాలుగా సహకరిస్తామని ఆయన తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏపీలో ఎన్నికలు కోసం పార్టీలు సిద్ధం.. పవన్ బస్సు స్పెషాలిటీ ఏంటంటే?