Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీలో మరిన్ని సడలింపులు ఇవ్వండి: కేజ్రీవాల్

Webdunia
శనివారం, 16 మే 2020 (16:12 IST)
ఢిల్లీలో లాక్ డౌన్ నుంచి మరిన్ని సడలింపులు ఇవ్వాలంటూ ఆ రాష్ట్ర సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రధాని మోడీని కోరారు. సోమవారం నుంచి లాక్ డౌన్ 4.0 అమల్లోకి రానుంది.

ఇది ఎలా ఉండాలో సూచనలివ్వాలంటూ ఇప్పటికే అన్ని రాష్ట్రాల సీఎం ల ను ప్రధాని మోడీ కోరారు. ఈ సారి లాక్ డౌన్ పుర్తిగా కొత్తగా ఉంటుందని ఇప్పటికే ప్రధాని మోడీ హింట్ ఇచ్చారు. ఐతే షాపింగ్ మాల్స్, రవాణా వ్యవస్థ, మాస్ గ్యాదరింగ్ లాంటి వాటికి అనుమతులివ్వారని తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మాత్రం కంటైన్ మెంట్ జోన్లు మినహా మిగతా ప్రాంతాల్లో ఆర్థిక కార్యకలాపాలను కొనసాగిస్తామని అందుకు అనుమతి ఇవ్వాలని ప్రధాని మోడీకి లెటర్ రాశారు.

ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఆర్థిక వ్యవస్థ గాడిలో పడాలంటే ఎప్పటి మాదిరిగా వాణిజ్య కార్యకలాపాలు కొనసాగాల్సి అవసరముందన్నారు. షాపింగ్ మాల్, మెట్రో తో పాటు పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ ను కూడా ప్రారంభించేందుకు అవకాశం ఇవ్వాలని కోరారు.

కరోనా వ్యాప్తి నివారణకు కావాల్సిన అన్ని చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఫిజికల్ డిస్టెన్స్, మాస్క్ తప్పనిసరి పాటించేలా అన్ని ఏర్పాట్లు చేస్తామన్నారు. సరి, బేసి విధానంలో రోజు సిటిలో ఉన్న షాపింగ్ మాల్స్ లో 33 శాతం మాత్రమే తెరిచేలా అవకాశం ఇవ్వాలన్నారు.

స్కూల్స్, సినిమా హాల్స్, జిమ్ లాంటివి మాత్రమే మూసి ఉంచుతామని చెప్పారు. ఐతే రేపటితో లాక్ డౌన్ 3.0 ముగియనుండగా 18 నుంచి ఉండబోయే లాక్ డౌన్ లో చాలా సడలింపులు ఉంటాయని అంచనా వేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అందం కోసం సర్జరీ చేయించుకున్న మౌనీ రాయ్?

మంచు మనోజ్‌ను చూసి బోరున ఏడ్చేసిన మంచు లక్ష్మి! (Video)

చియాన్ విక్రమ్‌ తనయుడితో మలయాళ బ్యూటీ డేటింగ్!!

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments