కరోనా కట్టడికి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పంచసూత్రాల ప్రణాళిక (5టీ ప్లాన్) ప్రకటించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ...5టీ ప్లాన్ గురించి వివరించారు.
టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీట్‌మెంట్, టీమ్ వర్క్, ట్రాకింగ్ అండ్ మానిటరింగ్ అనేదే 5 టీ ప్లాన్ అని కేజ్రీవాల్ స్పష్టం చేశారు. కరోనా కేసుల తీవ్రత దృష్ట్యా 12 వేల హోటల్ గదులను అద్దెకు తీసుకుని క్యారంటైన్ కేంద్రాలుగా మార్చబోతున్నామని చెప్పారు.
8 వేల మందికి సరిపోయేలా అత్యవసర చికిత్స అందించే ఏర్పాటు చేస్తున్నామని సీఎం పేర్కొన్నారు.