ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లొచ్చిన వారు బయటికి రావాలి

గురువారం, 2 ఏప్రియల్ 2020 (19:39 IST)
ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లొచ్చిన వారు తక్షణం ఆసుపత్రుల్లో రిపోర్ట్‌ చేయాలని టీపీసీసీ ప్రచార కమిటీ ఛైర్‌పర్సన్‌ విజయశాంతి విజ్ఞప్తి చేశారు. వైద్యశాలలో పరీక్షలు చేయించుకుని తమ కుటుంబాలను, సమాజాన్ని కాపాడాలని కోరారు.

ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లొచ్చిన వారు తక్షణం ఆసుపత్రులకు వెళ్లి వివరాలు అందించాలని విజయశాంతి సూచించారు. ముస్లిం సమాజాన్ని ఆరోపణల నుంచి కాపాడే ప్రయత్నం ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు.

సమాజ శ్రేయస్సు దృష్ట్యా జమాతే ఇస్లామీ అధ్యక్షుడు... ఇప్పటికే వారందరినీ పరీక్షలు చేయించుకోవాలని కోరినందుకు ధన్యవాదాలు తెలిపారామె.

ఇకనైనా ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారు ఆసుపత్రులకు వెళ్లి... తమను, తమ కుటుంబాలను, సమాజాన్ని కాపాడాలని కోరారు.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం లాక్‌డౌన్ ఉల్లంఘిస్తే రెండేళ్ల జైలు