Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీ ఆశ్రమంలో ఘోరం.. బాలికల ప్రైవేట్ పార్ట్స్‌పై కారం చల్లి..?

Webdunia
శనివారం, 29 డిశెంబరు 2018 (12:28 IST)
దేశ రాజధాని నగరం ఢిల్లీలో అరాచకాలు పెచ్చరిల్లిపోతున్నాయి. నిర్భయ లాంటి ఘటన చోటుచేసుకున్నప్పటికీ.. మహిళలపై అకృత్యాలకు పాల్పడే వారిపై కఠిన శిక్షలు అమలు చేసేందుకు కేంద్రం ఎలాంటి చర్యలు చేపట్టేలా కనిపించట్లేదు. తాజాగా ఢిల్లీలోని ఓ ఆశ్రమంలో బాలికలపై జరుగుతున్న దురాగతాలు వెలుగులోకి వచ్చాయి. ఆ ఆశ్రమంలో దారిలేక బసచేస్తున్న బాలికలపై మహిళా ఉద్యోగులు బాలికల ప్రైవేట్ భాగాలపై కారం చల్లి రాక్షసానందం పొందేవారు. 
 
గురువారం ఢిల్లీలోని ఆశ్రమాల్లో జరిగిన ఇన్స్‌స్పెక్షన్‌లో భాగంగా ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. ఢిల్లీలోని ద్వారకా ప్రాంతంలోని ఆశ్రమంలో 6-15 ఏళ్ల లోపు బాలికలను అక్కడ పనిచేసే వ్యక్తులు వేధించేవారని తెలిసింది. ఇంకా అక్కడ పనిచేసే మహిళా ఉద్యోగినులు పనిష్మెంట్ పేరుతో బాలికల ప్రైవేట్ పార్ట్స్‌పై కారం చల్లేవారని తెలిసింది. 
 
టీనేజీ అమ్మాయిలను గొడ్డును బాదినట్లు బాది పని లాగించుకునేవారని.. ఆశ్రమంలో పని మొత్తం వారి చేత చేయించేవారని ఇన్స్‌స్పెక్షన్‌లో వెల్లడి అయ్యింది. ఈ ఘటనపై పోలీసులు రంగంలోకి దిగి.. నిందితులను అదుపులోకి తీసుకున్నారు. బాధిత బాలికలను సురక్షిత ఆశ్రమాలకు తరలించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

ఆరెంజ్ చీరలో దిశా పటానీ అందాలు అదరహో.. (ఫోటోలు)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments