Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పెళ్ళిచేసుకోబోయే అమ్మాయీ... ఈ రాశికి చెందినవారు భర్త అయితే?

Advertiesment
పెళ్ళిచేసుకోబోయే అమ్మాయీ... ఈ రాశికి చెందినవారు భర్త అయితే?
, మంగళవారం, 20 నవంబరు 2018 (15:04 IST)
పెళ్ళిచేసుకోబోయే భర్తపైన ఎన్నో ఆశలు, ఆకాంక్షలు ఉంటాయి. తాను మనువాడబోయేవాడు అన్ని విధాలా సంతోష పెట్టాలని, మహరాణిలా చూసుకోవాలని ప్రతి ఆడపిల్ల కలలు కంటూ ఉంటుంది. తమ కూతురికి కాబోయే వ్యక్తితో అన్యోన్య దాంపత్యం ఉండాలని తల్లిదండ్రులు జన్మరాశులను కూడా ఒకటికి నాలుగుసార్లు చూస్తారు. అయితే ఆకాంక్షలకు తగిన వరుడు కావాలి అంటే ఈ రాశుల వారిని ఎంచుకోవాలంటున్నారు. 
 
మేషరాశిలో పుట్టిన వ్యక్తులు నమ్మకమైన భర్తగాను, మానసికంగా దృఢంగాను ఉంటారు. భార్య సంతోషం కోసం నిరంతరం పరితపిస్తుంటారు. సింహరాశి వారు నిరంతరం అప్రమత్తంగా ఉంటారట. అందుకే వీరిని ఎవరూ సుళువుగా మోసం చేయలేరు. భార్యలను చూసుకునే విషయంలో మాత్రం తేడా రానివ్వరు. కర్కాటక రాశి వారు అయితే భార్య ఆలోచనలే వేదంగా భావిస్తారు. భార్య కోరికలను గుర్తించి అవి నెరవేర్చడానికి కృషి చేస్తారు.
 
మిథున రాశి పురుషులు స్వతంత్ర్యంగా వ్యవహరిస్తారు. క్లిష్టమైన సమయాల్లో అండగా ఉంటారు. సమాజంలో వీరికి ఉన్న పేరుప్రతిష్టల కారణంగా కామన్‌గా అసూయ కూడా ఉంటుంది. మీనరాశి వాళ్ళు ఎల్లప్పుడూ భార్యలకు అందుబాటులో ఉంటారు. భార్యలు చెప్పే విషయాన్ని ఎలాంటి హడావిడి లేకుండా పనిచేస్తారు. వృషభ రాశి వారు సహచరికి సహాయకారిగా ఉంటారు. 
 
ధనుస్సు రాశి వారు మేథావి వర్గానికి చెందిన వారు. అనవసరమైన విషయాలను భార్యలతో చర్చించరు. కన్యారాశి వారు బంధాలపై ఆధారపడి ఉంటారు. కొన్నిసార్లు వీరి ప్రవర్తన వల్ల విసుగు పుడుతుందట. తులా రాశి వారు బ్యాలెన్స్‌గా ఉంటారు. వృశ్చిక రాశిలో జన్మించిన వారు రహస్యాలను దాచి పెడతారు. మకర రాశిలో జన్మించిన వ్యక్తులు ప్రేమను మనస్సులోనే దాచుకుంటారు. కుంభరాశి వారు సామాజిక సంబంధాలు కలిగి ఉంటారు. చాలామంది సహకారంతో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

20-11-2018 మంగళవారం దినఫలాలు - కొత్త వ్యక్తులతో పరిచయాలు మీ....