Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

20-11-2018 మంగళవారం దినఫలాలు - కొత్త వ్యక్తులతో పరిచయాలు మీ....

Advertiesment
20-11-2018 మంగళవారం దినఫలాలు - కొత్త వ్యక్తులతో పరిచయాలు మీ....
, మంగళవారం, 20 నవంబరు 2018 (08:35 IST)
మేషం: వ్యాపార రహస్యాలు, కుటుంబ విషయాలు గోప్యంగా ఉంచండి. దైవ, సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ శక్తి సమార్ధ్యాలపై మీకు నమ్మకం ఏర్పడుతుంది. ఎల్.ఐ.సి., బ్యాకింగ్ ఉద్యోగస్తులకు శ్రమాధిక్యత. పెట్టుబడులకు తగిన ప్రతిఫలం రాకపోవచ్చు. కొత్త వ్యక్తులతో పరిచయాలు మీ ఉన్నతికి నాందీ పలుకుతాయి. 
 
వృషభం: బ్యాంకు పనుల్లో జాప్యం ఇతర వ్యవహారాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ప్రముఖులతో పరిచయాలు, నూతన బంధుత్వాలు ఏర్పడుతాయి. రుణాలు చేబదుళ్ళకు యత్నాలు సాగిస్తారు. దీర్ఘకాలంగా వాయిదా పడుతున్న పనులు పట్టుదలతో పూర్తిచేస్తారు. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తిగా సాగుతాయి.  
 
మిధునం: ఉపాధ్యాయ రంగాల వారికి సంతృప్తి, పురోభివృద్ధి. వాహనం నడుపునపుడు జాగ్రత్త అవసరం. ఉద్యోగస్తులు కొత్త బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తారు. ఊహించని ఖర్చులు, చెల్లింపుల వలన ఆటుపోట్లు తప్పవు. మెుండి ధైర్యంతో శ్రమించి అనుకున్నది సాధిస్తారు. రవాణా రంగాలలోని వారికి ఏకాగ్రత అవసరం.    
 
కర్కాటకం: ఆర్థిక విషయాలలో సమస్యలు తలెత్తినా ముఖ్యుల సహకారం వలన పరిష్కరించబడుతాయి. స్త్రీల అభిప్రాయాలకు ఆమోదం లభించక పోవడంతో కుటుంబంలో చికాకులు తలెత్తుతాయి. షేర్ వ్యాపారస్తులకు సంతృప్తి కానరాగలదు. రిప్రజెంటేటివ్‌లకు నెమ్మదిగా మార్పులు కానవస్తాయి. ప్రముఖుల కలయిక సంతృప్తినిస్తుంది. 
 
సింహం: సన్నిహితులతో కలిసి వనసమారాధన, సమావేశాల్లో పాల్గొంటారు. సిమెంట్, ఐరన్, కలప రంగాలలో వారికి చురుకుదనం కానవస్తుంది. కొబ్బరి, పండ్లు, పూలు, కూరగాయల వ్యాపారస్తులకు సత్‌కాలం. విద్యార్థులకు నూతన వాతావరణం, పరిచయాలు సంతృప్తినిస్తాయి.  
 
కన్య: ఆర్థిక వ్యవహారాల్లో ఆశించిన ప్రయోజనాలు సాధించడం కష్టం. లారీ వ్యాపారస్తులకు చికాకులు తప్పవు. పాత వస్తువులు కొనడానికి చేయు ప్రయత్నాలు ఫలించగలవు. ఒకానొక సందర్భంలో మిత్రుల తీరుర నిరుత్సాహం కలిగిస్తుంది. ఇతరులతో అతిగా మాట్లాడడం మీ శ్రీమతికి నచ్చకపోవచ్చు. దైవదీక్షలు స్వీకరిస్తారు.  
 
తుల: స్త్రీలకు అకాల భోజనం, శ్రమాధిక్యత వలన స్వల్ప అస్వస్థకు గురవుతారు. ఖర్చులు రాబడికి తగినట్లుగానే ఉంటాయి. ఒక స్థిరాస్తిని అమర్చుకుంటారు. శ్రీవారు, శ్రీమతి గౌరవ ప్రతిష్టలకు భంగం కలిగించే పరిణామాలు ఎదుర్కుంటారు. బంధువుల రాకతో కుటుంబంలో ప్రశాంతత చోటుచేసుకుంటుంది.  
 
వృశ్చికం: విదేశీ యత్నాల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కుంటారు. ప్రముఖులను కలుసుకుంటారు. శత్రువులు మిత్రులుగా మారిమీకు సహాయాన్ని అందిస్తారు. విద్యార్థులకు వాహనం నడుపునపుడు జాగ్రత్త అవసరం. తలపెట్టిన పనులు దిగ్విజయంగా పూర్తిచేస్తారు. ఆస్థి విషయంలో సోదరుల నుండి ప్రతికూలతలెదుర్కోవలసి వస్తుంది.   
 
ధనస్సు: వ్యాపారా లావాదేవీలు ప్రోత్సహకరంగా ఉంటుంది. ఓ కార్యక్రమంలో మీ ప్రతిష్టకు భంగం కలిగించే ప్రయత్నాలు జరుగుతాయి. ఇతరులకు సలహా ఇవ్వడం వలన మాటపడవలసి వస్తుంది. ముఖ్యమైన వ్యవహారాలు ఇతరుల జోక్యం వలన వాయిదా పడుతాయి. సోదరీసోదరుల కలయిక పరస్పర అవగాహన కుదురును. 
 
మకరం: ఆర్థికంగా ఎదగాలనే మీ ఆశయం నిదానంగా ఫలిస్తుంది. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. ఉద్యోగస్తులు, ఉన్నతాధికారులు ఒత్తిడి, ప్రలోభాలకు దూరంగా ఉండడం క్షేమదాయకం. చేపట్టిన పనులు కొంత ఆలస్యంగానైనా సంతృప్తికరంగా పూర్తిచేస్తారు. పెంపుడు జంతువుల గురించి ఆందోళన చెందుతారు.  
 
కుంభం: ఆర్థికస్థితిలో ఆశించిన మార్పులు చోటు చేసుకుంటాయి. రాజకీయా, కళారంగాల వారికి విదేశీ పర్యటనలు సంభవం. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. శుభకార్యాల్లో హుందాగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు. గతంలో జరిగిన పొరపాట్లు పునరావృతం కాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవడం క్షేమదాయకం. 
 
మీనం: బ్యాంక్ పనులు నెమ్మదిగా కొనసాగుతాయి. నిరుద్యోగులకు రాత, మౌఖిక పరీక్షల్లో ఓర్పు, ఏకాగ్రత ఎంతో ముఖ్యమని గమనించండి. సొంతంగా వ్యాపారం చేయాలనే మీ ఆలోచన కార్యరూపం దాల్చుతుంది. విద్యార్థులు తోటి వారితో సఖ్యతగా మెలగవలసి ఉంటుంది. దైవ, సేవా, శుభకార్యాల్లో చురుకుగా వ్యవహరిస్తారు.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఈ కార్తీక మాసం నాడు ఈ ఒక్క పని చేస్తే చాలు... ఉద్యోగ-వ్యాపార బిజీ అనొద్దు...