Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆదివారం (18-11-2018) దినఫలాలు - మీరు పడిన కష్టానికి..

Advertiesment
ఆదివారం (18-11-2018) దినఫలాలు - మీరు పడిన కష్టానికి..
, ఆదివారం, 18 నవంబరు 2018 (08:24 IST)
మేషం: వృత్తిపరంగా ఎదురైనా ఆటంకాలు అధికమిస్తారు. కుటుంబీకులతో విందు, వినోదాలలో చురుకుగా పాల్గొంటారు. ఉపాధ్యాయులు విశ్రాంతి పొందుతారు. గతంలో మీరు పడిన కష్టానికి తగిన ఫలితం దక్కనుంది. దూరప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. మిత్రుల వ్యాఖ్యాలు మీపై మంచి ప్రభావం చూపుతాయి.
 
వృషభం: ఈ సమస్యలు కేవలం తాత్కాలికమేనని గమనించండి. వృత్తుల వారికి శ్రమించే కొలది కీర్తి, ఆదాయం ఉంటాయి. దైవ కార్యాల పట్ల ఆసక్తి కనబరుస్తారు. కుటుంబీకుల నుండి వ్యతిరేకత ఎదుర్కుంటారు. ప్రతి విషయంలోను సహనంతో వ్యవహరించాల్సి ఉంటుంది. పెద్దల ఆరోగ్యం గురించి ఎంతో కలవరపడుతారు.
 
మిధునం: వృత్తి వ్యాపారాల్లో గణనీయమైన పురోభివృద్ధి సాధిస్తారు. వనసమారాధనలో పాల్గొంటారు. సన్నిహితుల నుండి ఆహ్వానాలు అందుకుంటారు. ఆకస్మికంగా ప్రయాణం చేయవలసి వస్తుంది. ఇంతకాలం మీరెదురు చూస్తున్న అవకాశాలు మిమ్మల్ని వరిస్తాయి. దంపతుమ మధ్య కొత్త విషయాలు చర్చకు వస్తాయి.
 
కర్కాటకం: అందరితో కలిసి విందు, వినోదాలలో పాల్గొంటారు. స్త్రీలు నరాలు, ఎముకలు, దంతాలకు సంబంధించిన సమస్యలెదుర్కోవలసి వస్తుంది. కాంట్రాక్టర్లకు రావలసిన బిల్లులు మంజూరవుతాయి. సహోద్యోగులతో పరిచయాలు బలపడుతాయి. అవివాహితుల ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి.
 
సింహం: అవివాహితులకు సరైనా జోడీ దొరికే అవకాశం ఉంది. వ్యాపార పరంగా మరో కొత్త అడుగు ముందుకు వేస్తారు. పనిలో నైపుణ్యం సాధించేందుకు ప్రయత్నించండి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. స్త్రీలు వనసమారాధలలో పాల్గొంటారు. నూతన పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి.
 
కన్య: ఉమ్మడి వ్యవహారాలు, ఆర్థిక లావాదేవీలు సమర్థంగా నిర్వహిస్తారు. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాల్లో మెళకువ అవసరం. నూతన వ్యక్తులతో పరిచయాలు, వ్యాపకాలు మీ ఉన్నతికి నాందీ పలుకుతాయి. మీ బంధువుల కోసం ధనం అధికంగా ఖర్చు చేస్తారు. మీ సంతానం అత్యుత్సాహం ఇబ్బందులకు దారితీయవచ్చు.
 
తుల: గృహమునకు కావలసిన వస్తువులను కొనుగోలు చేస్తారు. దూరప్రయాణాలలో వస్తువుల పట్ల మెళకువ అవసరం. అవివాహితుల్లో నూతనోత్సాహం చోటు చేసుకుంటుంది. మిత్రుల వ్యాఖ్యాలు మీపై మంచి ప్రభావం చూపుతాయి. ఏ విషయంలోను మీ శ్రీమతికి ఎదురు చెప్పటం మంచిది కాదు.
 
వృశ్చికం: ఒక శుభకార్యం నిశ్చయం కావడంతో కల్యాణ మంటపాల కోసం అన్వేషిస్తారు. ఎదుటివారితో ఎలా మాట్లాడినా తప్పుగానే భావిస్తారు. స్థిరాస్తి అమర్చుకోవాలనే కోరిక బలీయమవుతుంది. స్త్రీలు చుట్టుప్రక్కల వారి నుండి కొత్త కొత్త విషయాలు గ్రహిస్తారు. రాబోయే ధనానికి ముందుగానే ఖర్చులు సిద్ధంగా ఉంటాయి.
 
ధనస్సు: ఆర్థిక, కుటుంబ సమస్యలకు చక్కని పరిష్కారం లభిస్తుంది. మత్స్య, కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. నిరుద్యోగులకు సంతోషం కలిగించే సమాచారం అందుతుంది. పెద్దల ఆరోగ్యం మెరుగుపడడంతో మానసిక ప్రశాంతత పొందుతారు. దైవ దర్శనాలు, పుణ్యక్షేత్ర సందర్శనాలకు అనుకూలం.
 
మకరం: మీ విజయం కుటుంబీకులు, బంధుమిత్రులకు సంతోషం కలిగిస్తుంది. ధనవ్యయం అధికమైనా సార్థకత ఉంటుంది. వాహనం నిదానంగా నడపడం క్షేమదాయకం. పట్టుదలతో శ్రమించి అసాధ్యమనుకున్న దానిని సాధిస్తారు. ఏజెంట్లు, బ్రోకర్లకు శుభదాయకంగా ఉంటుంది. నూతన వ్యాపారాల్లో పోటీని తట్టుకుంటారు.
 
కుంభం: స్త్రీలకు షాపింగ్ వ్యవహారాలలో అపరిచిత వ్యక్తుల పట్ల మెళకువ అవసరం. ఎదుటివారి విషయాలకు దూరంగా ఉండడం శ్రేయస్కరం. పారిశ్రామిక వేత్తలు, ఇసుక, క్వారీ కాంట్రాక్టర్లు అధికారుల నుండి అభ్యంతరాలెదుర్కోవలసి వస్తుంది. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. ప్రముఖులను కలుసుకుంటరాు.
 
మీనం: చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. మత్స్య, కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. మిత్రుల ప్రోత్సాహంతో దైవదీక్షలు స్వీకరిస్తారు. మీ పథకాలు, ప్రణాళికలు సత్ఫలిలనిస్తాయి. ఇంట ఒక శుభకార్యానికి అనువైన పరిస్థితులు నెలకొంటాయి. కొంతమంది ఆకస్మిక రాక అసహానం కలిగిస్తుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బంగారు ఆభరణాలను కాలికి ధరించకపోవడం మంచిది.. ఎందుకని?