కేవలం అమ్మాయిలు మాత్రమే లైంగిక వేధింపులకు గురవుతున్నారనుకుంటే పొరపాటనీ, అబ్బాయిలు కూడా లైంగికవేధింపులకు పాల్పడుతున్నారని సినీ నటి గౌతమి అభిప్రాయపడ్డారు. ఇటీవలి కాలంలో దేశంలో వరుసగా అత్యాచార ఘటనలు జరుగుతున్నాయి.
వీటిపై ఆమె స్పందిస్తూ, అమ్మాయిలేకాకుండా అబ్బాయిలకు కూడా రక్షణ లేకుండా పోయిందని వాపోయింది. వారు కూడా లైంగిక వేధింపులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. మగపిల్లలు లైంగిక వేధింపులు గురికావడం పరిస్థితి ఎంతమేరకు దిగజారిందో అర్థం చేసుకోవచ్చన్నారు.
ఇటువంటి వాటికి అడ్డుకట్ట వేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలదేనన్నారు. చట్ట విరుద్ధ చర్యలను అడ్డుకుని ప్రజలకు రక్షణ కల్పించాల్సింది ప్రభుత్వాలేనని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది.