Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కుమార్తెను లైంగికంగా వేధించిన వ్యక్తి మర్మాంగాలను కోసేసిన తండ్రి..?

కుమార్తెను లైంగికంగా వేధించిన వ్యక్తి మర్మాంగాలను కోసేసిన తండ్రి..?
, శుక్రవారం, 16 నవంబరు 2018 (11:46 IST)
చిన్నారులు, యువతులపై లైంగిక దాడులు పెరిగిపోతున్నాయి. కుటుంబ సభ్యుల నుంచో, లేకుంటే స్నేహితుల నుంచో, సొంత బంధువుల నుంచో లైంగిక వేధింపులకు గురవుతున్నారు యువతులు. తండ్రి వయస్సైన వ్యక్తే లైంగికంగా వేధించడంతో యువతి కొన్ని రోజుల పాటు భరించింది. ఆ తరువాత తండ్రికి వివరించింది.
 
చిత్తూరు రూరల్ మండలం చెన్నసముద్రం గ్రామంలో కేశవులు నివాసముండేవాడు. కేశవులకు ఒక కుమార్తె ఉంది. పేరు కళ్యాణి. అదే ప్రాంతానికి చెందిన శేఖర్ కేశవులు ఇద్దరూ మంచి స్నేహితులు. తన స్నేహితుడి కుమార్తెను లైంగికంగా వేధించాడు శేఖర్. కనిపించినప్పుడల్లా ఆమెతో అసభ్యకరంగా ప్రవర్తించేవాడు. సంవత్సరం పాటు తన తండ్రి కేశవులకు విషయం చెప్పకుండా భరిస్తూ వచ్చింది కళ్యాణి. అయితే శేఖర్ ఆగడాలు మరింత మితిమీరిపోవడంతో కళ్యాణి విషయాన్ని తండ్రికి చెప్పింది. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన కేశవులు శేఖర్‌ను చంపేయాలని ప్లాన్ చేశాడు.
 
పార్టీ చేసుకుందాం రమ్మని పిలిచాడు. శేఖర్ తన బాబాయ్ లక్ష్మయ్యను వెంట పెట్టుకుని కేశవులు చెప్పిన పొలాల వద్దకు వెళ్ళారు. ముగ్గురు కలిసి పూటుగా మద్యం సేవించారు. మద్యం మత్తులో ఉన్న శేఖర్‌తో కేశవులు గొడవపెట్టుకున్నాడు. రాయితో తలపై మోదాడు. శేఖర్ చనిపోకపోవడంతో కత్తితో నరికాడు. అంతటితో ఆగలేదు శేఖర్ మర్మాంగాలను కోసేశాడు. విషయం బయటకు వస్తుందని శేఖర్ బాబాయ్ లక్ష్మయ్యను కూడా బండరాయితో కొట్టి చంపి పరారయ్యాడు కేశవులు. పోలీసులు రంగంలోకి దిగి విచారణ జరపడంతో అసలు విషయం బయటపడింది. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

విష సర్పంతో సెల్ఫీ.. పామును మెడలో వేసుకుని ఫోజిచ్చాడు.. అంతే కాటేసింది..