Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గర్భవతికి శిరోముండనం చేసిన అత్తింటివారు.. ఎందుకంటే...

Advertiesment
గర్భవతికి శిరోముండనం చేసిన అత్తింటివారు.. ఎందుకంటే...
, మంగళవారం, 20 నవంబరు 2018 (14:04 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వ సంక్షేమ కేంద్రంలో ఆశ్రయం పొందున్న బాలికలకు మత్తుమందిచ్చి విటులవద్దకు పంపుతున్న ఘటన ఒకటి డియోరియో జిల్లాలో వెలుగులోకి వచ్చింది. తాజాగా అత్తింటి వారు ఓ అవమానకర చర్యకు పాల్పడ్డారు. కట్నం తేలేదని శిరోమండనం చేసి పుట్టింట్లో వదిలిపెట్టారు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, యూపీ రాష్ట్రంలోని హథారస్‌కు చెందిన సాదాబాద్ పోలీస్ స్టేషన్‌లో బాధితురాలి తండ్రి ఒక ఫిర్యాదు చేశాడు. అందులో తన కుమార్తెకు నాలుగేళ్ల క్రితం ఆలీగఢ్‌కు చెందిన ఓ వ్యక్తితో వివాహం జరిపించినట్టు చెప్పాడు. అయితే, పెళ్లయిన నాటి నుంచి అత్తింటివారు అదనపు కట్నం కావాలంటూ వేధిస్తూ వచ్చారని పేర్కొన్నాడు. 
 
ఈ క్రమంలో తన కుమార్తె నిండు గర్భిణి అని చూడకుండా తీవ్రంగా కొట్టి, చిత్రహింసలకు గురిచేయడమేకాకుండా శిరోమండనం చేసి తమ గ్రామ సరిహద్దుల్లో విడిచిపెట్టి వెళ్లారని, అందువల్ల తన కుమార్తెకు న్యాయం చేయాలని ఆయ ఫిర్యాదులో కోరారు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అయ్యబాబోయ్... మగాడిగా ఉండలేను.. హిజ్రాగానే జీవిస్తా...