కుర్రకారు హీరోయిన్లతో పోటీపడే అందం ఆమె సొంతం. అంతకు మించి అభినయం ఆమెది. ఆమె పేరు రమ్యకృష్ణ. తన సినీ కెరీర్ ఆరంభంలో ఐరెన్‌లెగ్‌గా ముద్ర వేయించుకున్న రమ్యకృష్ణ ఇపుడు ఆమె ఫేట్ మారిపోయింది. రమ్యకృష్ణ ఉంటే చిత్రం హిట్ అనే పేరును సొంతం చేసుకుంది.
నీలాంబరిగా, శివగామిగా పవర్ ఫుల్ పాత్రలు పోషించినా.. నాగార్జునతో 'నా బంగారం' అంటూ రొమాన్స్ చేసినా ప్రేక్షకులకు బోరరిపించదు. ఆమె ఇపుడు తెలుగు, తమిళ సినీ పరిశ్రమల్లో వరుస సినిమాల్లో నటిస్తూ మంచి జోరుమీద ఉన్నారు.
ఈ నేపథ్యంలో సినీ ఇండస్ట్రీలో జరుగుతున్న మీటూ చర్చపై ఆమె స్పందిస్తూ, నిజానికి సినిమా షూటింగుల కోసం అవుట్ డోర్స్‌కి వెళ్లినప్పుడు ఎప్పుడెప్పుడు అయిపోతుందా.. ఎప్పుడు ఇంటికి వెళ్తామా అని అనిపిస్తుంది. మరికొన్ని సినిమాలు అయితే అపుడే షూటింగ్ అయిపోయిందంటే బాధగా ఉంటుంది. ఇంటికి వెళ్లాలని అనిపించడం అని వ్యాఖ్యానించింది. కానీ నేటికాలపు హీరోయిన్లు మాత్రం అలాకాదనీ పార్టీలకు పబ్బులకు వెళుతుంటారన్నారు. పైగా పార్టీ అయిపోయినప్పటికీ ఇంటికెళ్లాలన్న ధ్యాస ఉండదన్నారు. అందుకే ఇలాంటి సమస్యల్లో ఇరుక్కుంటున్నారని చెప్పుకొచ్చారు.