Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శివాజీని లోపలేసి మక్కెలిరగ కొడితే... రోజా సెన్సేనషనల్ కామెంట్స్

Advertiesment
rk roja
, శుక్రవారం, 26 అక్టోబరు 2018 (19:07 IST)
హీరో శివాజీని ఉద్దేశించి సినీ నటి, వైకాపా ఎమ్మెల్యే ఆర్కే.రోజా సంచలన వ్యాఖ్యలు చేసింది. ఒక్క సినిమా అవకాశం కూడా లేకుండా ఏళ్ల తరబడి ఖాళీగా ఉన్న శివాజీని ముందు పెట్టుకుని చంద్రబాబు 'ఆపరేషన్ గరుడ' అంటూ కొత్త నాటకాన్ని ప్రారంభించారని ఆరోపించారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, కొత్త నాటకానికి తెరలేపిన చంద్రబాబు, అడ్రస్‌లేని శివాజీతో కలసి డ్రామా ఆడుతున్నారని, ఆయనేదో కాలజ్ఞానిలాగా చెప్పారంటూ, దాన్ని ఇప్పుడు నమ్ముతున్నానంటూ పిచ్చి పట్టినట్టు మాట్లాడుతున్నారని విమర్శలు గుప్పించారు. 
 
ముందుగానే ఒక స్క్రిప్టు రాయించి, దాన్ని శివాజీతో చెప్పించి, వెనుకనుంచి నడిపిస్తున్నది చంద్రబాబా? లోకేషా అన్న విషయాన్ని ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. శివాజీని లోపలేసి మక్కెలిరగ కొడితే, అసలు నిజాలన్నీ బయటకు వస్తాయని ప్రతి ఒక్కరూ అంటున్నారని రోజా వ్యాఖ్యానించారు. 
 
జగన్‌పై దాడి జరిగిన తర్వాత గంట వ్యవధిలోనే నిందితుడు, జగన్ కలిసున్నారంటూ చూపించేలా మార్ఫింగ్ చేసిన ఫొటోలను మీడియాకు చూపించారని గుర్తు చేసిన ఆమె, జగన్ అభిమాని అయితే, వెనుక వైఎస్, విజయమ్మల చిత్రాలు ఉంటాయని, అదే విధంగా ప్లెక్సీని ముద్రించిన స్టూడియో పేరు తప్పనిసరిగా ఉంటుందని, అవేమీ ఇందులో లేవని రోజా గుర్తు చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అలా అవడంతో నిద్ర మాత్రలు వేసుకున్న శ్రీరెడ్డి... ఎలా ఉంది?