Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Sunday, 13 April 2025
webdunia

లైంగిక వేధింపులు జరిగినప్పుడు చెప్పకపోవడం నేరమే... హీరో విశాల్

Advertiesment
Hero Vishal
, సోమవారం, 29 అక్టోబరు 2018 (15:38 IST)
ఇండస్ట్రీలో లైంగిక వేధింపుల గురించి నిర్మాతల వైపు నుండి ముగ్గురు సభ్యులున్న కమిటీని... బాధితుల తరపు నుండి ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు హీరో విశాల్ తెలిపారు. ఇంకా ఆయన మాట్లాడుతూ... ''ఇప్పుడున్న సమస్యలే కాకుండా భవిష్యత్‌లో రాబోయే నటీనటులకు భరోసా ఇచ్చేలా పారదర్శక నిర్ణయాలను తీసుకుంటాం. ఇందులో కౌన్సిలింగ్‌ కూడా ఇస్తాం. 
 
ఏదైనా నేరం జరిగినప్పుడు ఏమీ మాట్లాడకపోవడం కూడా సెక్షన్‌ 201 ప్రకారం నేరమే. ఏదైనా జరిగినప్పుడు వెంటనే స్పందించాలి. ఉదాహరణకు అమలాపాల్‌ ఓ లైంగిక వేధింపుల సమస్యను ఫేస్‌ చేసినప్పుడు నాకు వెంటనే ఫోన్‌ చేసింది. నేను కూడా వెంటనే కార్తికి ఫోన్‌ చేసి .. సత్వర చర్యలు తీసుకున్నాం కాబట్టే ఆ వ్యక్తిని అరెస్ట్‌ చేయగలిగాం. బాధిత అమ్మాయి ధైర్యంగా ముందుకు రావాలి. అలా ముందుకు వస్తే మన పేరు పోతుంది.. ఏదో అయిపోతుందని భయపడకూడదు. 
 
ఎదుటి వ్యక్తుల నుండి రెస్పాన్స్‌ వచ్చినప్పుడే ఏదైనా సపోర్ట్‌ చేయగలం. మీటూ ఉద్యమాన్ని తప్పుగా ఉపయోగించే అవకాశం కూడా ఉంది. ఉదాహరణకు రేపు ఎవరైనా నా మీద కూడా ఆరోపణలు చేస్తే.. నేను సంపాదించుకున్న పేరు మొత్తం పోతుంది. కాబట్టి ఏదైనా లైంగిక వేధింపులకు సంబంధించిన ఆరోపణలు చేసినప్పుడు ఆధారాలు కూడా ఉంటేనే మంచిది. ఎందుకంటే మీ టూని దుర్వినియోగం చేసే అవకాశాలు కూడా ఉన్నాయి అంటూ చెప్పుకొచ్చారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

లక్ష్మీ పార్వతిగా తనుశ్రీ దత్తా? : డైరెక్టర్ కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి