Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

శామీర్ పేట రేవ్ పార్టీ... డాక్టర్లకు అమ్మాయిలను సప్లై చేసింది వాళ్లే...

శామీర్ పేట రేవ్ పార్టీ... డాక్టర్లకు అమ్మాయిలను సప్లై చేసింది వాళ్లే...
, శనివారం, 22 డిశెంబరు 2018 (17:31 IST)
రేవ్ పార్టీ... తెల్లవార్లూ మద్యం తాగుతూ అమ్మాయిలతో ఎంజాయ్ చేయడం. శామీర్ పేటలో శుక్రవారం అర్థరాత్రి అర్థనగ్న నృత్యాలు చేస్తూ అశ్లీలంగా యువతులు, కొందరు డాక్టర్లు పట్టుబడ్డారు. ఐతే ఇదేదో మామూలు రేవ్ పార్టీయే అనుకున్నారంతా. కానీ అది కాదట. డాక్టర్లకు అమ్మాయిలను సప్లై చేసింది ఓ ప్రముఖ ఫార్మా కంపెనీ అని తేలింది. 
 
సహజంగానే ఫార్మా కంపెనీలు తయారుచేసే మందులను అమ్మాలంటే వైద్యుల సహాయసహకారాలు తప్పనిసరి. వైద్యులు సంతకాలు చేసి ధృవీకరిస్తేనే అవి మెడికల్ షాపులకు వస్తాయి. కాబట్టి ఇందుకోసం గతంలో ఫార్మా కంపెనీలు ఏవేవో బహుమతులతో వైద్యులను సంతృప్తి పరుస్తుంటాయనే వాదన వుంది. ఐతే తాజాగా వెలుగుచూసిన వ్యవహారంలో సదరు ఫార్మా కంపెనీ దారుణమైన పద్ధతిలో వెళ్లింది. 
 
బహుమతుల మాట అటుంచి ఏకంగా డాక్టర్లకు అమ్మాయిలను సప్లై చేసింది. ఈ వ్యవహారం పోలీసుల విచారణలో వెల్లడయినట్లు తెలుస్తోంది. ఫార్మా కంపెనీ ఇంతటి నీచమైన చర్యకు పాల్పడటంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. మరిన్ని ఆధారాలు సేకరించి కంపెనీపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు పోలీసులు రెడీ అవుతున్నట్లు సమాచారం.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హైద‌రాబాద్‌లో మందేసి పోలీసులపై చిందులు తొక్కిన మ‌హిళ‌..!