Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కర్నూలులో రేవ్ పార్టీ కలకలం.. యువతులతో నగ్న నృత్యాలు

Advertiesment
Kurnool
, శుక్రవారం, 9 నవంబరు 2018 (09:26 IST)
జిల్లా కేంద్రమైన కర్నూలులో రేవ్ పార్టీ కలకలం సృష్టించింది. ఈ పార్టీ పేరుతో పలువురు అమ్మాయిలతో నగ్న నృత్యాలు చేయించారు. ఈ సంఘటన పట్టణ కేంద్రంలోని నాలుగో టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో రావూరి గార్డెన్స్‌లో ప్రముఖ ఎరువులు, పురుగుల మందు సంస్థ ఏర్పాటు చేసిన పార్టీలో అశ్లీల నృత్యాలు వెలుగులోకి వచ్చాయి. ఈ రేవ్ పార్టీ పట్టపగలు ఉదయం నుంచి సాయంత్రం వరకు జరగడంతో కలకలం చెలరేగింది. దీంతో పోలీసులు అక్కడకు చేరుకుని నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, హైదరాబాదుకు చెందిన విస్టా అగ్రిటెక్‌ ఆగ్రోఫామ్స్‌ అనే సంస్థ తమ ఏజెంట్లకు, డీలర్లకు బుధవారం ఓ పార్టీ ఏర్పాటు చేసింది. ఈ పార్టీ ఉదయం నుంచి రాత్రి దాకా కొనసాగింది. ఉదయం సమావేశం, మధ్యాహ్నం భోజనాలు, సాయంత్రం మందు, అశ్లీల నృత్యాలతో కూడిన పార్టీ ఏర్పాటు చేసింది. ఈ పార్టీలో సుమారు 90 మందికి పైగా ఏజెంట్లు, డీలర్లు పాల్గొన్నారు. 
 
సాయంత్రం మహిళలతో చేయించిన అశ్లీల నృత్యాలు శృతి మించాయి. ఆ మహిళలు తమతో డ్యాన్స్‌ చేయాలని కొంత మంది ఏజెంట్లు, డీలర్లు పట్టుబట్టి గొడవకు దిగారు. ఈ ఘర్షణ తారాస్థాయి చేరుకోవడంతో కొంత మంది సెల్‌ఫోన్‌లో ఆ దృశ్యాలను చిత్రీకరించారు. ఈ దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.
 
ఈ విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు అక్కడకు చేరుకునేసరికి పార్టీ ఏర్పాటు చేసిన నిర్వాహకులు, డీలర్లు, ఏజెంట్లు అప్పటికే వెళ్లిపోయారు. దీంతో పోలీసులు ఆ ఫంక్షన్‌ హాలులో ఉన్న సీసీ కెమెరాలను స్వాధీనం చేసుకుని పరిశీలించారు. సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిన మహిళల అశ్లీల నృత్యాలు వాస్తవమేనని ధ్రువీకరించారు. ఫంక్షన్‌ హాల్‌ యజమాని శ్రీనివాసమూర్తితో పాటు విస్టా అగ్రిటెక్‌ ఆగ్రోఫామ్స్‌ సంస్థ నిర్వాహకులపై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మోడీ చేస్తున్న అన్యాయాన్ని నిలదీద్దాం.. రండి... చెన్నై టీడీపీ నేతల పిలుపు