Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలికపై గ్యాంగ్ రేప్, తప్పించుకుని పారిపోతున్న బాలిక ఛాతీపై తుపాకీ గురిపెట్టి...

Webdunia
మంగళవారం, 30 మార్చి 2021 (15:20 IST)
మహారాష్ట్రలోని పూణే నగరంలో దారుణం జరిగింది. మైనర్ బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు ఐదుగురు కామాంధులు. ఈ కేసుకు సంబంధించి ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. పరారీలో వున్న మరో ముగ్గురిని పట్టుకునేందుకు గాలిస్తున్నారు.
 
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, బాలిక పూణేలోని సహకర్ నగర్ ప్రాంతంలో నివసిస్తున్నది.
 పుట్టినరోజు పార్టీ వుందంటూ ఆ బాలికను ఆమె స్నేహితుడు పూణేలోని వార్జే మాల్వాడి ప్రాంతంలో పుట్టినరోజు పార్టీకి తీసుకెళ్లాడు. పుట్టినరోజు వేడుక ముగియగానే ఇంటికి వెళ్లేందుకు ఆమె సిద్ధమవుతుండగా ఆమెను అక్కడే వుండాలంటూ ఆమె స్నేహితుడి బోయ్ ఫ్రెండ్స్ ఒత్తిడి చేశారు.
 
ఆ తర్వాత కొద్దిసేపటికి ఐదుగురు వ్యక్తులు ఆమెను గదిలోకి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధిత బాలిక వారి చెర నుంచి ఎలాగో తప్పించుకుని ఇంటికి వెళ్తోంది. ఐతే నిందితుల్లో ఒకరు ఆమెను అటకాయించాడు. అడుగు ముందుకేస్తే కాల్చి పారేస్తానంటూ ఆమె ఛాతీపై తుపాకీతో గురిపెట్టాడు. ట్రిగ్గర్ నొక్కాడు.
 
కానీ అదృష్టివశాత్తూ ఆమె తన ఛాతీపై సెల్ ఫోన్ వుంచుకోవడంతో బుల్లెట్ తగిలి పక్కకెళ్లిపోయింది. స్వల్ప గాయాలయ్యాయి. దాంతో సదరు నిందితుడు బాధిత బాలికను, ఆమె స్నేహితుడి స్థానిక ఆసుపత్రిలో పడేశాడు. ఈ కేసుకు సంబంధించి ఇద్దరు నిందితులను పూణే పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని మూడు రోజుల పాటు పోలీసు కస్టడీకి తరలించారు. మరో ముగ్గురు నిందితులను పట్టుకునేందుకు గాలిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ హసన్ లాంచ్ చేసిన నవీన్ చంద్ర నటించిన లెవెన్ గ్రిప్పింగ్ ట్రైలర్

కిష్కింధపురి ఫస్ట్ గ్లింప్స్ లో కొన్ని తలుపులు తెరవడానికి వీలు లేదు

పహాల్గాం షూటింగ్ జ్ఞాపకాలు షేర్ చేసుకున్న హీరోయిన్ నభా నటేష్

వరుణ్ తేజ్‌చిత్రంలో ఐటెం సాంగ్ చేస్తున్న దక్ష నాగర్కర్ !

నేటి, రేపటి తరానికి కూడా ఆదర్శం పద్మభూషణ్ బాలకృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

ఈ ఒక్క చెక్క ఎన్నో అనారోగ్యాలను పారదోలుతుంది, ఏంటది?

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

తర్వాతి కథనం