Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రాజమౌళి చిత్రంలో డ్రీమ్ గర్ల్‌గా నటించాలనుంది: వైల్డ్ డాగ్ బ్యూటీ సయామి

Advertiesment
రాజమౌళి చిత్రంలో డ్రీమ్ గర్ల్‌గా నటించాలనుంది: వైల్డ్ డాగ్ బ్యూటీ సయామి
, సోమవారం, 29 మార్చి 2021 (17:14 IST)
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి చిత్రంలో తను డ్రీమ్ గర్ల్ గా నటించాలన్న ఆశ వుందని వైల్డ్ డాగ్ బ్యూటీ సయామీ ఖేర్ అంటోంది. ఆమె నటించిన వైల్డ్ డాగ్ చిత్రం ఏప్రిల్ 2న విడుదలకు సన్నద్ధమవుతోంది. ఈ చిత్రంలో నాగార్జున ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. అహిషోర్ సోలమన్ దర్శకత్వం వహించారు. 2007 హైదరాబాద్ పేలుళ్లపై నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఈ చిత్రం రూపొందించబడింది.
 
సయామి బాలీవుడ్‌లో పాపులర్ అయిన ఫేస్. ఐతే ఆమె టాలీవుడ్ చిత్రం రేలో 2015లో నటించింది. కానీ ఆ చిత్రం బయటకు రావడానికి మూడేళ్ల కాలం పట్టింది. ఆ చిత్రంలో తన నటనను గుర్తుచేసుకుంటూ, సరైన సమయంలో అది విడుదలయినట్లయితే టాలీవుడ్ ఇండస్ట్రీలో మరిన్ని చిత్రాల్లో నటించేదాన్నంటూ చెప్పుకొచ్చింది.
 
వైల్డ్ డాగ్‌లో ఆమె రీసెర్చ్ & అనాలిసిస్ వింగ్ (రా) ఏజెంట్ పాత్రను పోషిస్తుంది. ఆమె శిక్షణ పొందిన క్రీడాకారిణి, మార్షల్ ఆర్ట్స్‌లో నేపథ్యం ఉన్నందున, ఇది ఈ చిత్రంలో ఆమెకు సహాయపడింది. కాగా తనకు మాత్రం రాజమౌళి చిత్రంలో నటించాలన్న ఆశ వుందని చెప్పుకొచ్చింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

`బ్రాందీ డైరీస్‌` అర్జున్ రెడ్డి లాంటి సినిమాః నిర్మాత‌లు