Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

`బ్రాందీ డైరీస్‌` అర్జున్ రెడ్డి లాంటి సినిమాః నిర్మాత‌లు

`బ్రాందీ డైరీస్‌` అర్జున్ రెడ్డి లాంటి సినిమాః నిర్మాత‌లు
, సోమవారం, 29 మార్చి 2021 (16:25 IST)
Brandy Diaries trailer
వ్యక్తిలోని వ్యసన స్వభావాన్ని దానివల్ల వచ్చే సంఘర్షణలతో సహజమైన సంఘటనను, సంభాషణలు పరిణితి ఉన్న పాత్రలతో ఆద్యంతం ఆసక్తికరంగా కొనసాగుతూ వాస్తవికత వినోదాల మేళవింపు తో ప్రేక్షకుల ముందుకు వస్తున్న చిత్రమే "బ్రాందీ డైరీస్". గరుడ శేఖర్, సునీత సద్గురు హీరో, హీరోయిన్లు గా కలెక్టీవ్ డ్రీమర్స్ పతాకంపై శివుడు దర్శకత్వంలో లేళ్ల శ్రీకాంత్, మిత్ర బృందం కలసి నిర్మించిన క్రౌడ్ ఫండెడ్ చిత్రం "బ్రాందీ డైరీస్". ఈ చిత్రానికి ప్రకాశ్ రెక్స్ సంగీతాన్ని అందించగా జానపద గాయకుడు రచయిత పెంచల దాసు ఒక పాట ఇవ్వగా సాయి చరణ్, హరిచరణ్ మరియు రవికుమార్ విందా నేపధ్యగానం సమకూర్చారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైన ఈ సినిమా ట్రైలర్ లాంచ్ సోమ‌వారం హైద‌రాబాద్‌లో జ‌రిగింది. ప్రముఖ నిర్మాతలు ప్రసన్న కుమార్, తుమ్మలపల్లి రామసత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
 
రామసత్యనారాయణ మాట్లాడుతూ, చాలా వరకు కథా బలం లేకుండా సినిమాలు వస్తున్నాయి. కానీ బ్రాందీ డైరీస్ మంచి కథబలం ఉన్న సినిమా. ఇటీవలే సినిమా చూశాను. ఇది అర్జున్ రెడ్డి లాంటి సినిమా. అందరికీ అంత పేరొచ్చే సినిమా అవుతుంది. సినిమాలో స్టార్స్ ఎవరూ లేరు అందరూ కొత్త వాళ్ళే. డైరెక్టర్ విసుగు లేకుండా ఆడియన్ కూర్చోబెట్టేలా ఆసక్తిగా తెరకెక్కించారు. టైటిల్ తోనే సినిమా ఎలా ఉంటుందో వివరణ ఇచ్చారు. యూత్ కోసం తీసిన సినిమా ఇది. నిర్మాతల మండలి నుండి ప్రతీ చిన్న సినిమాకు  సహకారం అందిస్తున్నాము. వైజాగ్ లో చిన్న సినిమాలకు శంకర్ బెస్ట్ డిస్ట్రిబ్యూటర్. అతను ఈ సినిమాను వైజాగ్ , ఈస్ట్ లో విడుదల చేస్తున్నాడు. 'వకీల్ సాబ్' రిలీజ్ రోజే సినిమాను రిలీజ్ చేయమని సలహా ఇచ్చాను. సినిమా బాగుంటే ప్రేక్షకులు ఎప్పుడూ చూస్తారు అన్నారు.
 
 ప్రసన్న కుమార్ మాట్లాడుతూ " కరోన టైంలో భయపడని ఎలిమెంట్ ఏదైనా ఉందంటే అది బ్రాందీ షాపులే. మద్యం అనేది చాలా మందికి నిత్యవసం అయిపోయింది. సినిమాకు పర్ఫెక్ట్ టైటిల్ పెట్టారు. అద్భుతమైన టైటిల్ ఇది. చిన్న సినిమాల మధ్య వచ్చి ఇబ్బంది పడకుండా పెద్ద సినిమాతో వస్తే కొన్ని థియేటర్స్ లభిస్తాయి. ఏప్రిల్ 10 న వస్తే బెటర్ గా ఉంటుందని నా సలహా. మద్యం గురించి తీసిన ఈ సినిమా మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నా"అన్నారు.
 
webdunia
Sunita, Sekar
చిత్ర దర్శకుడు శివుడు మాట్లాడుతూ,  కథకు కరెక్ట్ గా యాప్ట్ అవుతుందని "బ్రాందీ డైరీస్" టైటిల్ పెట్టడం జరిగింది. ఈ సినిమా కథ ఆరుగురు వ్యక్తుల చుట్టూ తిరుగుతుంది. ఆల్కహాల్ తాగితే  వచ్చే ఇబ్బందులు ఏమిటి, దాని వలన ఎం నస్టం జరుగుతుందనే  విషయాన్ని ఈ చిత్రం ద్వారా  తెలియజేస్తున్నాం. సినిమా మొదటి నుంచి ఎండింగ్ వరకు  బ్రాందీ మీదనే కథ నడుస్తుంది .ఇప్పటి వరకూ తెలుగులో ఇటువంటి సినిమా రాలేదు. మేము తీసిన ఈ కొత్త కథను డ్రమాటిక్ గా ప్రేక్షకులకు ఎంటర్ టైన్మెంట్ మిస్ కాకుండా తీసుకు వస్తున్నాం. రంగస్థల కళాకారులు కూడా సినిమాలో నటించారు" అన్నారు.
 
నిర్మాత మాట్లాడుతూ, సహజత్వానికి పట్టం కడుతూ పూర్తిగా కొత్త నటీనటులతో సినిమా రూపుదిద్దుకుంది.  కథే ముఖ్య పాత్రగా 52 రోజుల్లో 104 లొకేషన్లలో సింగిల్ షెడ్యూల్లో సినిమాను పూర్తి చేశాము. తక్కువ బడ్జెట్ లో ఎక్కువ నాణ్యతతో తీసిన మా సినిమా అన్నారు.
హీరో శేఖర్, హీరోయిన్ సునీత, సద్గురు, వైజాగ్ డిస్ట్రిబ్యూటర్శంకర్ మాట్లాడుతూ, సినిమా విజ‌య‌వంతం ప‌ట్ల ఆశాభావం వ్య‌క్తం చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పవన్ కల్యాణ్ యుద్ధ మెళుకువ‌లు