O manchiroju choosi cheputa
`నన్ను పెళ్లిచేసుకోవడం నీకిష్టమా! అంటే వెంటనే మామయ్య నా కిష్టం అంటూ.. నిహారిక కొణిదెల అంటోంది. ఇది విజయ్ సేతుపతి నటించిన తమిళ చిత్రం "ఓరు నల్ల నాల్ పాతు సోలరెన్` లోనిది. ఈ సినిమాను తెలుగులో "ఓ మంచి రోజు చూసి చెప్తా`గా అనువదించారు. ఏప్రిల్ 2న సినిమా విడుదల కానున్న సందర్భంగా గురువారం తెలుగు ట్రైలర్‌ను విడుదల చేశారు.
విజయ్ సేతుపతి, నిహారిక కొణిదెల జంటగా ఆరుముగా కుమార్ దర్శకత్వంలో విడుదలై విజయవంతం అయినా తమిళ చిత్రం "ఓరు నల్ల నాల్ పాతు సోలరెన్". మరి ఇప్పుడు ఈ చిత్రాన్ని తెలుగులో "ఓ మంచి రోజు చూసి చెప్తా" అనే టైటిల్ తో విడుదల చేస్తున్నారు. శ్రీమతి రావూరి అల్లికేశ్వరి సమర్పణలో అపోలో ప్రొడక్షన్స్ పతాకం పై డాక్టర్ రావూరి వెంకటస్వామి నిర్మిస్తున్న ఈ చిత్రానికి సెన్సార్ సభ్యులు క్లీన్ యు సర్టిఫికెట్ ఇచ్చి సినిమా చాలా బాగుంది అని మెచ్చుకున్నారు. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 2న విడుదల అవుతుంది. అయితే ఈ చిత్రం యొక్క థియేట్రికల్ ట్రైలర్ ను విడుదల చేసారు. మంచి స్పందన లభించింది.
ఈ సందర్భంగా నిర్మాత డాక్టర్ రావూరి వెంకటస్వామి మాట్లాడుతూ "ఓ మంచి రోజు చూసి చెప్తా" చిత్రం తమిళం లో మంచి విజయం సాధించింది. విజయ్ సేతుపతి గారి నటన ఈ చిత్రానికే ఒక హై లైట్. నిహారిక కొణిదెల గారు ఎప్పుడు చేయని పాత్రలో కనిపిస్తారు. ఇది ఒక మాస్ యాక్షన్ ఎంటర్టైనర్. మా చిత్రం ట్రైలర్ కి మంచి స్పందన లభించింది. చిత్రం ఖచ్చితంగా విజయం సాధిస్తుంది అని నమ్మకం కలిగింది. మా చిత్రం సెన్సార్ అయ్యింది, సెన్సార్ సభ్యులు క్లీన్ యు సర్టిఫికెట్ ఇచ్చారు. సినిమా అద్భుతంగా ఉంది అని మెచ్చుకున్నారు. మా చిత్రాన్ని ఏప్రిల్ 2న విడుదల చేస్తున్నాము" అని తెలిపారు.