Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నిహారిక భర్త సినిమాల్లో నటిస్తాడా?

Advertiesment
Hubby
, సోమవారం, 15 ఫిబ్రవరి 2021 (22:11 IST)
తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగా హీరోలు ఎంట్రీ ఇవ్వడం కొత్తేమీ కాదు. ఓ క్రికెట్ టీమ్‌లా మెగా కుటుంబానికి చెందిన హీరోలున్నారు. రీసెంట్‌గానే వైష్ణవ్ తేజ్ కూడా హీరోగా ఎంట్రీ ఇచ్చి సూపర్ డూపర్ హిట్ కొట్టాడు. అయితే ఎప్పటి నుంచో అందరిలో మొదలుతున్న ప్రశ్న.. ముఖ్యంగా నిహారిక పెళ్లి తర్వాత. నిహారిక భర్త చైతన్య జొన్నలగడ్డ సినిమా ఎంట్రీ ఎప్పుడు? అని. 
 
అయితే ఈ ప్రశ్నలకు నిహారిక కొణిదెల తనదైన స్టైల్లో సమాధానం చెప్పి అందరికీ క్లారిటీ ఇచ్చేసింది. రీసెంట్ ఇంటర్వ్యూలో తన భర్త చైతన్య సినీ రంగ ప్రవేశం గురించి నిహారిక మాట్లాడుతూ ''చైతన్యకు సినిమాలంటే చాలా ఇష్టం. అలాగని తను సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తాడని కాదు. తను సినిమాలను చూడటానికి బాగా ఇష్టపడతాడు. సినిమాల్లో నటించాలనే ప్యాషన్ ఉంటేనే యాక్టర్ అవుతాడు. చైతన్యకు అలాంటి ఆసక్తి లేదు'' అని చెప్పేసింది.
 
గత ఏడాది నిహారిక, చైతన్య జొన్నలగడ్డ పెళ్లి రాజస్థాన్‌లో ఉదయ్ పూర్ ప్యాలెస్‌లో ఘనంగా జరిగింది. చైతన్య జొన్నలగడ్డ బేసిగ్గా టెక్ మహేంద్ర జాబ్ చేస్తున్నాడు. మరి ఉద్యోగం వదిలేసి చైతన్య సినిమాల్లోకి వస్తాడా? అనే దానిపై ఇప్పుడైతే నిహారిక సమాధానం చెప్పేసింది కానీ.. భవిష్యత్తులో ఎలాంటి మార్పులు చోటుచేసుకుంటాయో వేచి చూడాలి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆపదలో వున్నవారికి ఆపద్భాంధవుడు.. సోనూసూద్ కొత్త స్కీమ్!