Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

టాలీవుడ్ మన్మథుడితో.. టాలీవుడ్ చందమామ రొమాన్స్.. రోల్ తెలిస్తే? (Video)

టాలీవుడ్ మన్మథుడితో.. టాలీవుడ్ చందమామ రొమాన్స్.. రోల్ తెలిస్తే? (Video)
, శుక్రవారం, 26 మార్చి 2021 (09:37 IST)
టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్‌కు వరుసగా ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. పెళ్లైన తర్వాత కాజల్ అగర్వాల్‌కు మంచి మంచి అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి. తన అందచందాలతో పాటు చక్కని నటనతో ఇప్పటికీ వరుస సినిమాలతో అదరగొడుతోనే ఉంది. ఓ వైపు కుర్ర హీరోలతో నటిస్తూనే సినీయర్స్‌తో కూడా రొమాన్స్ చేస్తోంది. ప్రస్తుతం కాజల్.. చిరంజీవి, కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న 'ఆచార్య' చిత్రంలో నటిస్తోంది. 
 
స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు పొందిన కాజల్.. ఇటు తెలుగు సినిమాలు చేస్తూనే అటూ తమిళ్, హిందీ సినిమాలు చేస్తోంది. అందులో భాగంగా కాజల్ 'ముంబై సాగా' అనే హిందీ సినిమాలో నటించింది. ఈ సినిమా ఇటీవల విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది. ఆ సినిమాతో పాటు కాజల్ తెలుగులో నటించిన మరో సినిమా మోసగాళ్ళు. ఈ సినిమా కాజల్‌తో పాటు మరో ప్రధాన పాత్రలో మంచు విష్ణు నటించాడు. ఈ సినిమా కూడా ఇటీవల విడుదలై ఓకే అనిపించింది.
 
ఇక తాజాగా కాజల్ తెలుగులో నటిస్తోన్న చిత్రం విషయానికి వస్తే.. ఆమె మొదటిసారి నాగార్జున సరసన నటిస్తోంది. కింగ్ నాగార్జున హీరోగా `గరుడవేగ` ఫేమ్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో వస్తున్న ఓ యాక్షన్ థ్రిల్లర్.. రూపోందుతుంది. ఈ సినిమా ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. కాగా ఈ సినిమాలో కాజల్ కీలకపాత్రలో కనిపించనుంది. అంతేకాదు ఈ సినిమాలో కాజల్ పాత్ర.. ఆమె గతంలో నటించిన అన్ని పాత్రలకు సంబంధం లేకుండా.. ఎంతో భిన్నంగా ఉంటుందట. 
 
ఈ విషయాన్ని ఈ సినిమా దర్శకుడు ఇటీవల ఓ మీడియాతో మాట్లాడుతూ కాజల్ పాత్రకు సంబంధించి ఆసక్తికరమైన వివరాలు వెల్లడించాడు. ఇందులో కాజల్ `రా` ఏజెంట్ గా కనిపిస్తుందట. అంతేకాదు ఆమె ఈ సినిమాలో నెవర్ సీన్ బిఫోర్ లుక్‌లో, భిన్న బాడీ లాంగ్వేజ్‌తో తను సర్ ప్రైజ్ చేయబోతోందట. ఈ సినిమాలో తన పాత్ర కోసం కాజల్ ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నట్లు తెలిపాడు. అందులో భాగంగా కాజల్ మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్, రైఫిల్ షూటింగ్ కి సంబంధించి తర్ఫీదు తీసుకుంటుందట.

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వాస్త‌వానికి ద‌ర్ప‌ణం`అర‌ణ్య‌`